Take a fresh look at your lifestyle.

‌ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

ఖమ్మం నగరంలో సిపిఎం 2 టౌన్‌ ‌కమిటి ఆధ్వర్యంలో శుక్రవారం సరితాక్లినిక్‌ ‌సెం•ర్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేసారు. సిఐటియు రాష్ట్ర కార్యా)యానికి తాళం వేయటాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహ కులు తెలిపారు. ఈ సందర్బంగా జరిగిన సభలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ సాధించిన తరువాత ఏ వర్గాల ప్రజలు ధర్నాలు, నిరసనలు చేపట్టే అవసరం రాదని చెప్పిన ముఖ్యమంత్రి ఈనాడు ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పారు.

అదేవి ధంగా పోలీసులతో పాలన కొనసాగిస్తే గత పాలకులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరిం చారు. టిఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను అమలు పర్చాలని ఆశావర్కర్లు ఆందోళనకు పూనుకుంటే వారిని అక్రమంగా అరెస్ట్ ‌చేయడమేగాకుండా సిఐటియు రాష్ట్ర కార్యాలయానికి ఏ హక్కుతో పోలీసులు తాళం వేసారని ప్రశ్నించారు. ప్రజా స్వామ్యవాదులు ఈ చర్యలను ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి మధు, టి విష్ణువర్దన్‌, ‌వై విక్రమ్‌, ‌నకిరికంటి చిరంజివి, నర్రా రమేష్‌,‌జింకల శ్రీను, బుర్రి వెంకటకుమార్‌, ‌బి ఉపేందర్‌నాయక్‌, ‌హుస్సేన్‌, ‌మచ్చా సూర్యం, బోడపట్ల సుదర్శన్‌, ‌జె వెంకన్నబాబు, సిహెచ్‌ ‌భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: CITU leaders B Madhu, T Vishnu Vardhan, Y Vikram, Nirkirinanti Chiranjeevi, Narra Ramesh, Jinka Srinu, Burri Venkatamar,

Leave a Reply