Take a fresh look at your lifestyle.

అభ్యర్థుల గ్రామాల్లో పూర్తి స్థాయి విచారణ చేయాలి

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్తర్వుల ప్రకారం ఏజన్సీ దృవీకరణపత్రాల కొరకు అర్జీలు పెట్టుకునే అభ్యర్దుల నుండి వంశానికి సంబంధించిన డాక్యు మెంటేషన్‌ ‌సంబంధిత మండల ఆర్‌ఐలు అభ్యర్ధుల భవిష్యత్తును వారి జీవితాన్ని బాగుపరిచే విధంగా ఉద్యోగం వారికి వచ్చేల కృషి చేయాలని భద్రాచలం ఐటిడిఏ పిఓ గౌతమ్‌ ‌పొట్రూ తహశీల్దారులకు సూచించారు. మంగళవారం నాడు ఐటిడిఏ పియంఆర్‌సి సమావేశమందిరంలో ఏజన్సీ ట్రైబల్‌ అభ్యర్దుల ఉద్యోగాల అర్హత కలిగిన ఏజన్సీ సర్టిఫికెట్‌లు దృవీకరణపత్రాలతో తీసుకోవల్సిన డాక్యుమెంటేషన్‌పై సంబంధిత అభ్యర్దుల వంశ పారంపర్యంగా సంక్రమించే రికార్డుల ప్రకారం అనగా 29 జనవరి 1950 సంవత్సరములో ప్రవేశ పెట్టిన నిబంధనల ప్రకారం అభ్యర్దుల కాస్తాపాని లేదా భూమికి సంబంధించిన రికార్డు లేదా భూమి లేకపోతే వేరే డాక్యుమెంటేషన్‌ ‌ప్రకారం క్లీయర్‌గా వెరిఫికేషన్‌ ‌చేయాలని ఆయన అన్నారు. ఎవరైన దొంగ సర్టిఫికెట్‌లు ప్రొజరీ చేస్తే వారిపై క్రిమినల్‌ ‌కేసులు పెట్టి ఎఫ్‌ఐఆర్‌ ‌ఫైల్‌ ‌చేయించాలని అన్నారు.

తహశీల్దారులు అభ్యర్దులు సరైన డాక్యుమెంట్లు ఇచ్చి వారి యొక్క ఏజన్సీ దృవీకరణఫైల్‌ ‌కరెక్ట్‌గా వెరిఫికేషన్‌ ‌చేసి సర్టిఫై చేస్తే ఎటువంటి పొరపాట్లు దొర్లవని , అభ్యర్దుల డాక్యుమెంటేషన్‌ ‌ఫైల్‌ ‌జిరాక్సులు ప్రతులు తనకు తప్పకుండా పంపించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఇన్‌చార్జీ సబ్‌కలెక్టర్‌ ‌స్వర్ణలత, మహబూబాబాద్‌, ‌ఖమ్మం, కల్లూరు ఆర్‌డిఓ లు సంబంధిత తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply