Take a fresh look at your lifestyle.

దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడిన…

యాంకర్‌ ‌ప్రదీప్‌, ‌కవిత పిఏ సంతోష్‌రావు తదితరులను అరెస్టు చేయండి  ఎన్‌ఎస్‌యూఐ డిమాండు 
 టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిందనీ, మహిళలకు అసలే రక్షణ లేకుండా పోయిందనీ రాష్ట్ర ఎన్‌ఎస్‌యూఐ కార్యదర్శి రాచకొండ ప్రశాంత్‌ ఆరోపించారు.  దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడిన యాంకర్‌ ‌ప్రదీప్‌, ‌మాజీ ఎంపి కవిత పిఏ సంతోష్‌రావుతో పాటు దళిత యువతిపై అత్యాచారానికి ఒక్కరినీ తక్షణమే అరెస్టు చేయాలని  ప్రశాంత్‌ ‌డిమాండు చేశారు. గురువారం సిద్ధిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్‌లో ప్రశాంత్‌ ‌మాట్లాడుతూ..దిశ కేసులో జరిగిన న్యాయమే గిరిజన యువతి విషయంలో  సైతం జరిగేలా ప్రభుత్వ వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.
దళిత యువతిపై 139మందికి పైగా దారుణానికి పాల్పడితే ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ ‌చేయలేదనీ ప్రశ్నించారు. శాంతి భద్రత విషయంలో దేశంలోనే  మొదటి స్థానంలో  తెలంగాణ ఉందని ప్రగల్భాలు పలికే సిఎం కేసీఆర్‌ ఎక్కడున్నారనీ నిలదీశారు.  మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ వెంటనే అరెస్ట్ ‌చేయాలన్నారు. దళిత యువతిని రేప్‌ ‌చేసిన 139మందితో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ 10రోజులలో అరెస్టు చేసి శిక్షించాలనీ లేదంటే  ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దయెత్తున ఆందోళనలు చేపడుతామనీ  ప్రశాంత్‌ ‌హెచ్చరించారు. ఈ సమావేశంలో  కొప్పు రవి, స్వామి ,కపిల్‌ ‌పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply