Take a fresh look at your lifestyle.

సోషల్‌ ‌వర్క్ ఎడ్యుకేషన్‌ ‌కు కౌన్సెల్‌ ఏర్పాటు చేయాలి

తెలంగాణ యూనివర్శిటీ గ్రాంట్స్ ‌కమిషన్‌ (‌యుజిసి), ఆల్‌ ఇం‌డియా కౌన్సిల్‌ ఆఫ్‌ ‌టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఎఐసిటిఇ), మెడికల్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా (ఎంసిఐ), రిహాబిలిటేషన్‌ ‌కౌన్సెల్‌ ఆఫ్‌ ఇం‌డియా (ఆర్‌.‌సి.ఐ) మరియు బార్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా (బిసిఐ) వంటి స్వయంప్రతిపత్త కలిగిన సంస్థల ద్వారా భారతదేశంలో ఉన్నత విద్య భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా,ప్రణాళిక బద్దంగా రూపొందించబడుతుంది. కౌన్సెల్లు వృత్తిపరమైన లక్ష్యాన్ని నిర్దేశించడానికి,ప్రత్యేక మైన విభాగానికి సంబంధించిన అంశాలలో పరిశోధనను సులభతరం చేయడానికి ఎంతగానో దోహదం చేస్తాయి.మానవ హక్కులు,సామాజిక న్యాయం రెండు కళ్ళుమానవ హక్కులు,సామాజిక న్యాయం ల పరిరక్షణలో సోషల్‌ ‌వర్క్ ‌కు రెండు కళ్ళు లాంటివి. సోషల్‌ ‌వర్క్ ‌విద్యా నిపుణులు సామాజిక మార్పు,మానవ సంబంధాల మెరుగుదలలో ఎదురయ్యే సమస్యల పరిష్కార దిశలో పని చేయడం, ప్రజల సాధికారిత సాధన దిశలో పనిచేయడం జరుగుతుంది.

సోషల్‌ ‌వర్క్ ఎడ్యుకేషన్‌ ‌మరియు దేశంలోని దాని వృత్తిపరమైన అభ్యాసం ప్రస్తుత వాస్తవాలపై దృష్టి పెట్టాలి మరియు నిత్యజీవిత సమస్యల పరిష్కార దిశగా ఉండే విధంగా విద్య ప్రణాళిక చట్రాన్ని రూపొందించాలి. జాతీయ స్తాయిలో కౌన్సెల్‌ ఏర్పాటు ఆవశ్యకత కరోన మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రస్తుత తరుణంలో సోషల్‌ ‌వర్క్ ‌విద్యకు భారత దేశంలో జాతీయ స్తాయి కౌన్సెల్‌ ఏర్పాటు చేయవల్సిన అవసరం ఉంది. ప్రస్తుత సామాజిక సమస్యలను పరిష్కరించేటప్పుడు, అభివృద్ధి చెందుతున్న వాస్తవాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సోషల్‌ ‌వర్క్ ఎడ్యుకేషన్‌ అనువర్తన-ఆధారిత మరియు నైపుణ్యాల తరం మీద దృష్టి పెట్టాలి. సమాజానికి సోషల్‌ ‌వర్క్ ‌ప్రొఫెషనల్స్ ‌విస్తృత సేవలు అవసరంగా మారాయి.

ప్రస్తుతం సోషల్‌ ‌వర్క్ ‌విద్యను అభ్యసించిన వారు జనాభాకు తగినంతగా లేకపోవడం దేశ అభివృద్దికి ఆటంకంగా మారే అవకాశం ఉంది. కౌన్సెల్‌ ఏర్పాటు ద్వారా ఉద్యోగ అవకాశాలు సృస్టించబడటం తో నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఈ వృత్తిలోకి రావడానికి అవకాశాలు ఏర్పడుతాయి.పర్యవేక్షణకు ప్రత్యేక విధానం అవసరంసోషల్‌ ‌వర్క్ ఎడ్యుకేషన్‌ ‌పద్దతి మరియు మూల్యాంకనాన్ని పర్యవేక్షించడానికి ఒక విధానం అవసరం,ఎందుకంటే సిలబస్‌,‌ బోధనా పద్ధతులు, క్షేత్రస్థాయి పని మరియు వివిధ స్థాయిలలో మూల్యాంకనం పరంగా ఎటువంటి పొందిక లేదు. ప్రస్తుతం సోషల్‌ ‌వర్క్ ఉద్యోగ ఆధారిత కోర్సుగా అందించబడుతున్నపడికీ, తగినంతగా మౌలిక సదుపాయాల మరియు అవసరమైన నిబంధనలను పాటించడం లేదు.

కాలం చెల్లిన భావనలను తొలగించి, ప్రస్తుత మరియు భవిష్యత్‌ అవసరాలను పౌర సమాజాల అభివృద్ధి మరియు కార్పొరేట్‌ ‌సామాజిక బాధ్యత వంటి భావనలను చేర్చడం ద్వారా సిలబస్‌ను సరిదిద్దాలి. మానవ అభివృద్ధి సూచిక నేడు పురోగతికి ప్రమాణంగా ఉండటంతో వివిధ వర్గాల వివిధ అవసరాలను తీర్చడానికి సోషల్‌ ‌వర్క్ ‌విద్య ప్రామాణికత ముఖ్యం.సోషల్‌ ‌వర్క్ ‌విద్య బిల్లు అమల్లోకి వచ్చేనా….సోషల్‌ ‌వర్క్ ‌విద్యను క్రమబద్ధీకరించే ఆలోచనను 1980 లో యుజిసి సోషల్‌ ‌వర్క్ ఎడ్యుకేషన్‌ ‌పై రెండవ సమీక్ష కమిటీలో రూపొందించారు. సాంఘిక పని విద్యను అప్‌‌గ్రేడ్‌ ‌చేయడానికి మరియు ప్రమాణాలను నిర్వహించడానికి నేషనల్‌ ‌వర్క్ ‌ఫర్‌ ‌సోషల్‌ ‌వర్క్ ఎడ్యుకేషన్‌ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. అప్పుడు సంక్షేమ మంత్రిత్వ శాఖ ముసాయిదా బిల్లును తయారు చేసింది, దానిని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు పంపారు. ఈ పక్రియలో యుజిసిని సంప్రదించి,1995 లో ముసాయిదా బిల్లు ఖరారు చేయబడింది.

ఈ బిల్లు మరుగున పడి పోయింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన నేషనల్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌సోషల్‌ ‌వర్క్ ‌విద్య 2021 బిల్లు లో సోషల్‌ ‌వర్క్ ఎడ్యుకేషన్‌ ‌నిర్వహణ మరియు అమలుపై చట్టబద్ధమైన నిబంధనలు వృత్తిపరమైన అధికారాన్ని కలిగి ఉంటాయి. యూనివర్శిటీ గ్రాంట్స్ ‌కమిషన్‌ (‌యుజిసి) మార్గదర్శకాల ప్రకారం 900 గంటల క్షేత్రస్థాయి పని ఉండాలనే నిబంధన ఉంది. ముసాయిదా బిల్లు సోషల్‌ ‌వర్క్ ‌దూరవిద్య ద్వారా పూర్తి చేసిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ ‌విషయంలో స్పస్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. సోషల్‌ ‌వర్క్ ‌విద్యకు అంతర్జాతీయ గుర్తింపుముసాయిదా బిల్లు ప్రకారం, ప్రొఫెషనల్‌ ‌సోషల్‌ ‌వర్క్ అర్హత అంటే ఒక వ్యక్తికి కనీసం బ్యాచిలర్‌ ‌డిగ్రీ ఉండాలి లేదా యుజిసి గుర్తింపు పొందిన కళాశాల లేదా విశ్వవిద్యాలయం నుండి సామాజిక పనిలో మాస్టర్‌ ‌డిగ్రీ ఉండాలి.

సోషల్‌ ‌వర్క్ ‌మరియు సోషల్‌ ‌వర్క్ ‌చేసే సామాజిక వేత్తల పని భిన్నంగా ఉంటాయి. ప్రొఫెషనల్‌ ‌సోషల్‌ ‌వర్క్ ఒక అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉద్యోగం. భారతదేశంలో 1936 లో టాటా ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌సోషల్‌ ‌సైన్సెస్‌ ‌స్థాపనతో సోషల్‌ ‌వర్క్ ‌రంగంలో శిక్షణ పొందిన ఉద్యోగులను కలిగి ఉండటానికి కృషి చేసింది. సోషల్‌ ‌వర్క్ ‌విద్య నిపుణులకు అక్రిడిటేషన్‌ ఇవ్వాలిభారతదేశంలోని ప్రొఫెషనల్‌ ‌సోషల్‌ ‌వర్కర్స్ ‌మరియు పారా సోషల్‌ ‌వర్కర్లకు అక్రిడిటేషన్‌ అం‌దించడం మరియు సోషల్‌ ‌వర్క్ ‌ప్రొఫెషనల్‌ ‌నేషనల్‌ ‌రిజిస్టర్ను నిర్వహించడం ద్వారా ఒకే రకమైన ప్రామాణిక వృత్తిపరమైన సోషల్‌ ‌వర్క్ ‌విద్య ను అభ్యసించడం సాధ్యం అవుతుంది. ప్రొఫెషనల్‌ ‌సోషల్‌ ‌వర్క్ ఎడ్యుకేషన్‌ ‌మరియు ప్రాక్టీస్‌పై జాతీయ విధానం, ప్రణాళిక మరియు కార్యక్రమాలు కలిగి ఉండాలి. సోషల్‌ ‌వర్క్ అం‌తర్జాతీయంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న వృత్తి. ప్రపంచం లోని చాలా దేశాలలో సోషల్‌ ‌వర్క్ ‌విద్య ప్రాధాన్యత పెరుగుతోంది.

Atla
డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి
రిహాబిలిటేషన్‌ ‌సైకాలజిస్ట్ ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌, 9703935321

Leave a Reply