Take a fresh look at your lifestyle.

ఉత్తరాదిని వణికిస్తున్న చలిపులి

  • పొగమంచుతో వాహనదారుల ఇక్కట్లు
  • చలిగాలులతో అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణశాఖ

న్యూదిల్లీ, జనవరి5 : ఉత్తరాదిలో మళ్లీ చలిపులి స్వారీ చేస్తోంది. ఢిల్లీతో పాటు యూపిలో ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయాయి. ఈ క్రమంలో యూపిలో స్కూళ్లకు ప్రత్యేక సెలవులు ప్రకటించారు. మరోవైపు రాజధాని ఢిల్లీని చలి గజగజ వణికిస్తోంది. ఈ  సీజన్‌ ‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. దేశ రాజధానిలో 3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  ఢిల్లీతో సహా ఉత్తర భారతంలో దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగ మంచు కురుస్తూనే ఉంది.  రానున్న రెండ్రోజుల పాటు ఢిల్లీ,ఉత్తర భారతంలో చలిగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. నేషనల్‌ ‌క్యాపిటల్‌ ‌రీజియన్‌ ‌పరిధిలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరెంజ్‌ అలర్ట్ ‌జారీ చేసింది.

సిటీలో మ్యాగ్జిమమ్‌ ‌టెంపరేచర్లు 15 డిగ్రీలలోపే  ఉండొచ్చని చెప్పింది. కాగా, చలి పెరగడంతో ఢిల్లీని పొగమంచు కప్పేసింది. రోడ్లపై వెహికల్స్ ‌కనిపించడం లేదు. పొగమంచు వల్ల రోడ్లపై ట్రాఫిక్‌ ‌జామ్‌ అయింది. ఢిల్లీకి వచ్చే రైళ్లు ఆలస్యంగా నడిచాయి. 19 రైళ్లు ఆలస్యంగా వచ్చాయి. రానున్న నాలుగైదు రోజులు నార్త్ ‌వెస్ట్ ‌రాష్టాల్రపై చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్‌, ‌హర్యానా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో సాధారణంగా కంటే తక్కువగా టెంపరేచర్లు నమోదవుతాయని చెప్పింది. హర్యానా, పంజాబ్‌కు రెడ్‌ అలర్ట్ ‌జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌ ‌లో మ్యాగ్జిమమ్‌ ‌టెంపరేచర్లు 10 నుంచి 12 డిగ్రీల మధ్యే నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.చలి పంజాకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు.

దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో చలి గాలులు వీస్తున్నాయి. బుధవారం ఉదయం 4.4 డిగ్రీలకు పడిపోయింది. ఈ సీజన్‌ ‌లో ఇదే అతి తక్కువ టెంపరేచర్‌ అని వాతావరణ శాఖ తెలిపింది. హిల్‌ ‌స్టేషన్లు అయిన డెహ్రాడూన్‌ (4.5 ‌డిగ్రీలు), ధర్మశాల (5.2 డిగ్రీలు), నైనిటాల్‌ (6 ‌డిగ్రీలు) కంటే తక్కువ టెంపరేచర్‌ ‌ఢిల్లీలో నమోదైందని వెల్లడించింది.జమ్మూకాశ్మీర్‌లో విపరీతమైన మంచు కురుస్తోంది. నైట్‌ ‌టెంపరేచర్లు భారీగా పడిపోయాయి. మంగళవారం రాత్రి అతి తక్కువగా పహల్గామ్‌లో మైనస్‌ 9.4 ‌డిగ్రీల టెంపరేచర్‌ ‌నమోదైందని అధికారులు చెప్పారు. గుల్‌ ‌మార్గ్‌లో మైనస్‌ 8.4 ‌డిగ్రీలు, కుప్వారాలో మైనస్‌ 6 ‌డిగ్రీలు, శ్రీనగర్‌లో మైనస్‌ 5.2 ‌డిగ్రీలు, కోకర్‌ ‌నాగ్‌లో మైనస్‌ 3.8 ‌డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయని తెలిపారు.

Leave a Reply