డెహ్రాడూన్,జనవరి4 : వికెట్ కీపర్ రిషబ్‌పంత్‌ని తదుపరి చికిత్స కోసం బుధవారం ముంబైకి తరలించాలన ఇనిర్ణయించాన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ డిస్టిక్్రక్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ (డిడిసిఎ) శ్యామ్ శర్మ డియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’రోడ్డు ప్రమాదానికి గురైన రిషబ్‌పంత్‌ని తదుపరి చికిత్స కోసం ముంబైకి తరలిస్తున్నాము.
నేను అతని తల్లితో మాట్లాడుతున్నాను. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆమెకు చెబుతున్నాను’ అని అన్నారు. డిసెంబర్ 30వ తేదీన డెహ్రాడూన్‌లో రిషబ్‌పంత్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇటీవలే అతనికి డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రి వైద్యులు కాలిన గాయాలకు చిన్నపాటి లాస్టిక్ సర్జరీ కూడా చేశారు.