Take a fresh look at your lifestyle.

దండగన్న వ్యవసాయాన్ని పండగలా చేస్తున్న కేసీఆర్‌

ప్రపంచానికి అన్నం పెట్టే రైతుకే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత : రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, ‌సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి  

నాగర్‌ ‌కర్నూల్‌,‌జులై 7.ప్రజాతంత్రవిలేకరి: రాష్ట్రంలో దండగన్న వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పండగలా చేస్తున్నారని,ప్రపంచానికి అన్నం పెట్టే రైతుకే రాష్ట్రప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, ‌సహకార శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి అన్నారు.మంగళవారం మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా తిమ్మాజీపేట, బిజినేపల్లి, తాడూర్‌ ‌మండలంలోని పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.రైతులు తప్పె ట్లతో మంత్రికి స్వాగతం పలికారు.తిమ్మాజీ పేట మండ లం పోతిరెడ్డిపల్లిలో పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం భవనాన్ని మరియు పీర్ల చావిడిని ప్రారంభించారు.రూ.7 లక్షల 50వేల వ్యయంతో నిర్మించిన గోపాలమిత్ర భవ నాన్ని ప్రారంభించి హరితహారం కింద మొక్కలు నాటా రు. అంతేకాక 22 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిం• •నున్న రైతు వేదికకు శంకుస్థాపన చేశారు. ఎదిరే పల్లి గ్రామంలో తెలంగాణకు హరితహారం కింద మొక్కలు నాటారు.మారే పల్లి గ్రామంలో 22 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రైతు వేదిక కు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వ్యవసాయం లాభసాటి చేసేందుకు రైతు వేదికలను నిర్మించడం జరుగుతున్నదని అన్నారు. వ్యవసాయం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన వెల్లడించారు .నూతన వ్యవసాయ విధానం, లాభసాటి పంటల సాగుతో పాటు ,మార్కెటింగ్‌ ‌వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు. ఇతర ఉత్పత్తుల మాదిరిగానే రైతు పండించిన పంటకు ధర నిర్ణయించే స్థాయికి తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వ్యవసాయం వృత్తి కాదని ఒక జీవన విధానం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, రైతులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇందులో భాగంగానే ప్రపంచాన్ని పట్టి పీడిస్తు న్న కరోనా లాక్డౌన్‌ ‌సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలుఏర్పాటు చేసి రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిం దన్నారు.

రైతు బంధు పథకం కింద రాష్ట్రంలోని 56 లక్షల 94 వేల మంది రైతుల ఖాతాలలో ఇప్పటివరకు రూ.7183 కోట్లను జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు. నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లాలో 2014 కు పూర్వం కేవలం ఏడు వేల మెట్రిక్‌ ‌టన్నుల వరి ధాన్యం మాత్రమే పండించగా ఇప్పుడది లక్షా డెబ్బై రెండు వేల మెట్రిక్‌ ‌టన్నులకు చేరుకున్నదని , వట్టేం, ఏదుల రిజర్వాయర్‌ ‌పూర్తి అయితే భవిష్యత్తులో దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా మారుతుందని,అందులోపాలమూరు కూడా ఉంటుందని అన్నారు. మారేపల్లిలో పది వేల మెట్రిక్‌ ‌టన్నుల సామర్థ్యం తో వ్యవసాయ గోదాం నిర్మించేందుకు మంత్రి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.5 ఎకరాల స్థలాన్ని ఇస్తే తక్షణమే గోదాము నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ గతంలో వ్యవసాయం సాగు చేసేందుకు మొగులు కోసం చూసేవారని ఇప్పుడా పరిస్థితి లేదని, వరదనీటితో చెరువులు, కుంటలు, రిజర్వాయర్‌ ‌లు నింపి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం జరిగిందని అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని అన్ని చెరువులను నింపటం జరిగిందని,బావులు,చెరువులలో నీరు పుష్కలంగా ఉందని, భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్తో పాటు, రైతుబంధు, రైతు బీమా, ఇస్తున్నదని,నియంత్రిత వ్యవసాయ సాగుతో లాభసాటి పంటలు వేసుకోవాలని కోరారు. రైతులు వారి సమస్యలను, సూచనలు, సలహాలను చర్చించుకొనేందు కు రైతు వేదికల నిర్మాణం చేపట్టడం జరిగిందని, రాబోయే కాలంలో వ్యవసాయాన్ని పండగ చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ‌చైర్పర్సన్‌ ‌పెద్దపల్లి పద్మావతి, డిసిసిబి డైరెక్టర్‌ ‌జక్క రఘునందన్‌ ‌రెడ్డి,అదనపు కలెక్టర్‌ ‌హనుమంత్‌ ‌రెడ్డి, ఎంపీపీ రవీందర్‌ ‌రెడ్డి, జెడ్పిటిసి దయాకర్‌ ‌రెడ్డి ఇతర మండల ప్రజా ప్రతినిధులు, ఆర్డిఓ నాగలక్ష్మి, స్థానిక సిల్దార్‌ ,ఎం‌పీడీవో, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply