Take a fresh look at your lifestyle.

‌వైద్యం వికటించి ఇద్దరు మహిళలు మృతి

సిరిసిల్ల పట్టణంలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో వైద్యం వికటించి ఇద్దరు మహిళలు మృతి చెందడంతో ఉద్రిక్తత ఏర్పడింది.దీనికి సబంధించిన వివరాలిలా ఉన్నాయి.రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన శీల పైల్స్ ఆపరేషన్‌కోసం,సిరిసిల్ల పట్టణం గణేశ్‌నగర్‌కు చెందిన కల్పన కుటుంబ సియంత్రణ ఆపరేషన్‌కోసం సిరిసిల్ల పట్టణంలోని తేజ ఆసుపత్రిలో మూడు రోజుల క్రితం చేరారు.వారికి ఈ ఆసు పత్రిలోని వైద్యులు ఆపరేషన్లు నిర్వహించగా ఇద్దరి పరిస్ధితి విషమంగా మారింది. ఈ క్రమంలో కల్పన ఆసుపత్రిలోనే మృతి చెందగా,శీలను కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది.దీనితో మృతిచెందిన కల్పన,శీల కుటుంబ సభ్యులు,బంధువులు తే• ఆసుపత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు.

తమకు న్యాయం చేయాలని, వారంతా డిమాండ్‌ ‌చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు
చేరుకుని వారిని శాంతింప చేయడానికి యత్నించారు.ఇదే సమయంలో జిల్లా ఆరోగ్యవైద్యాధికారి డాక్టర్‌ ‌సుమన్‌ ‌మోహన్‌రావు తన సిబ్బందితో అక్కడకు చేరుకుని ఆసుపత్రిలోని మందులను,పరిసరాలను గమనించి,ఆసుపత్రిని సీజ్‌ ‌చేశారు.అయినప్పటికిని తమకు న్యాయం జరిగేంత వరకు తాము ఇక్కడనుండి కదిలేది లేదని శీల,కల్పనల కుటుంబ సభ్యులు పట్టుబట్టారు.దీనితో పోలీస్‌ అధికారులు అక్కడకు చేరుకుని ఆసుపత్రి నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వారిని సముదాయించి,పంపించారు.

Leave a Reply