Take a fresh look at your lifestyle.

9 ‌నుంచి 23 వరకు రైతు భరోసా చైతన్య యాత్రలు

  • నకిలీ విత్తనాలను అడ్డుకోవడానికి గట్టి చర్యలు
  • జగనన్న పచ్చతోరణం కార్యక్రమంపై దృష్టి పెట్టాలి
  • 8న రైతు దినోత్సవం జరపాలి : అధికారులకు జగన్‌ ఆదేశాలు

అమరావతి,జూలై 6 : ఈనెల 9 నుంచి 23 వరకు రైతు భరోసా చైతన్య యాత్రలు చేపట్టాలని సీఎం వైఎస్‌ ‌జగన్‌ అధికారులను ఆదేశించారు. ఆర్‌బీకేల విధివిధానాలు, సీఎం యాప్‌ ‌పనితీరు, ఈ-క్రాపింగ్‌, ‌వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం జగన్‌ ‌తెలిపారు. విత్తనాల నాణ్యత విషయంలో ఎప్పటికప్పుడు పరిశీలనలు చేయాలని, నకిలీ విత్తనాలను అడ్డుకోవడానికి గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమంపై దృష్టి పెట్టాలని, విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం చురుగ్గా సాగాలని సీఎం జగన్‌ ‌పేర్కొన్నారు. డిసెంబర్‌కల్లా 4,024 గ్రామాలకు ఫైబర్‌ ‌కనెక్షన్‌ అం‌దుతుందని, ఆ సమయానికల్లా ఆయా పంచాయతీల్లో డిజిటల్‌ ‌లైబ్రరీలు సిద్ధం కావాలన్నారు.

పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమంపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. అర్హులైన వారికి 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు ఇవ్వాలని సూచించారు.ఆర్‌వోఎఫ్‌ఆర్‌ ‌కింద పంపిణీ చేసిన భూముల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, హార్టికల్చర్‌, ‌సెరికల్చర్‌లు ఆయా భూముల్లో సాగయ్యేలా చేయాలని సీఎం వైఎస్‌ ‌జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈనెల 8న రైతు దినోత్సవం నిర్వహిస్తున్నామని, 22న వైఎస్‌ఆర్‌ ‌కాపునేస్తం, 29న జగనన్న విద్యాదీవెన అమలు చేస్తామని సీఎం జగన్‌ ‌తెలిపారు. అలాగే థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి అధికారులను వ్యాక్సినేషన్‌ 100‌శాతం పూర్తయ్యేవరకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఆదేశించారు.

మంగళవారం స్పందన కార్యక్రమంపై సక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ‌మాట్లాడుతూ.. కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సెకండ్‌ ‌డోస్‌ ‌వ్యాక్సిన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, సంబంధిత కార్యక్రమాలపై కలెక్టర్లు దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. 94.84 లక్షల ఎకరాల్లో పంటలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వ్యాఖ్యానించారు. 4.98 లక్షల ఎకరాల్లో మాత్రమే ఇప్పటివరకు పంటలు వేశారని సీఎం జగన్‌ ‌తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply