Take a fresh look at your lifestyle.

దేశంలోని అత్యుత్తమ సీఎంలలో.. కేసీఆర్‌కు 9వ స్థానం

  • మొదటి మూడు స్థానాల్లో యోగి, కేజ్రీవాల్‌, ‌జగన్‌
  • ‌కొరోనా కట్టడిలో విఫలమైన సీఎంలకు చివరి స్థానం

దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు 9వ స్థానం దక్కింది. ఉత్తర ప్రదేశ్‌ ‌సీఎం యోగి ఆదిత్యనాద్‌దాస్‌కు ప్రథమ, డిల్లీ సీఎం అర్వింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌రెండో స్థానంలో నిలవగా, ఏపీ సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌మూడో స్థానం దక్కించుకున్నారు. జూలై 15 నుంచి 27 మధ్య ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ ‌ది నేషన్‌ ‌పేరిట నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. పశ్బిమ బంగ సీఎం మమతా బెనర్జీ 4, బీహార్‌ ‌సీఎం నితీష్‌ ‌కుమార్‌ 6, ‌మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ‌ఠాక్రే 7, ఒడిషా సీఎం నవీన్‌ ‌పట్నాయక్‌ 8, ‌రాజస్థాన్‌ ‌సీఎం అశోక్‌ ‌గెహ్లాట్‌ 10 ‌తరువాత స్థానాలలో నిలిచారు.

దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 97 లోక్‌సభ నియోజకవర్గాలలో ఈ సర్వే జరిగింది. 12 రోజుల పాటు 12, 021 మందిని ఇండియా టుడే టెలిఫోన్‌ ఇం‌టర్వ్యూ ద్వారా అభిప్రాయాలను సేకరించింది. ఆయా రాష్ట్రాలలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, కొరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలు వంటి అంశాలపై సంస్థ అభిప్రాయాలను సేకరించింది. కాగా, ఈ సర్వేలో కొరోనా కట్టడిలో విఫలమైన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చివరి స్థానం దక్కడం విశేషం.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!