Take a fresh look at your lifestyle.

98.2 శాతం మంది క్షేమం..!

కొరోనా తో భయపడాల్సింది లేదు
ప్రపంచ దేశాలతో పోలిస్తే మనమే నయం: కేంద్రం

‌దేశంలో కొరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తున్న వేళ..  ప్రజలు భయడాల్సిన అవసరం లేదని, ప్రపంచ దేశాలతో పోల్చితే.. భారత్‌లో అతి తక్కువ శాతం మంది మాత్రమే కొరోనా బారినపడ్డారని వెల్లడించింది. మంగళవారం డియాతో మాట్లాడిన కేంద్ర ఆరోగ్యశాఖ ఉమ్మడి కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ ఈ ‌విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ దేశాలతో పోల్చితే ఇప్పటివరకు మనదేశంలో కొరోనా బారిన పడిన వారి శాతం తక్కువేనని చెప్పారు.

అమెరికా జనాభాలో దాదాపు 10.1 శాతం మంది కొరోనా బారిన పడ్డారని, అలాగే ఫ్రాన్ల్సో 9 శాతం మంది జనాభాకు ఈ మహమ్మారి సోకిందని, ఇటలీలో 7.4 శాతం, బ్రెజిల్లో 7.3 శాతం మంది జనాభాను కొవిడ్‌ ‌పీడించిందని, ఇక రష్యాలో కూడా 3.4 శాతం మంది ప్రజలకు కొరోనా సోకిందని ఆయన చెప్పారు. కానీ ఆ దేశాలతో పోల్చితే మన దేశ జనాభాలో ఇప్పటివరకు కేవలం 1.8 శాతం మంది మాత్రమే కొరోనా బారిన పడ్డారని, ఇంకా 98.2 శాతం మంది క్షేమంగానే ఉన్నారని తెలిపారు.

Leave a Reply