Take a fresh look at your lifestyle.

పేద ప్రజలను ఆదుకుంటాం మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌చంద్రపాల్‌

మెదక్‌ , ‌మే 9 (ప్రజాతంత్ర ప్రతినిధి) : కొరోనా వైరస్‌ ‌కారణంగా పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నదృశ్ట్య వారిని ఆదుకుంటామని మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌చంద్రపాల్‌ అన్నారు.ఈ సందర్భంగా శనివారం నిత్యావసర సరుకులను మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌చంద్ర పాల్‌ ‌పంపిణీ చేశారు. కరోనా వ్యాధి అరికట్టేందుకు ప్రభుత్వం లాక్‌ ‌డౌన్‌ ‌విధించడంతో పేద ప్రజలకు 27 వార్డులో నిత్యావసర సరుకుల ను అందజేశారు. బియ్యం,  కూరగాయలతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ ‌మాట్లాడుతూ కరోన కరువు కాలంలో పేద ప్రజలను ఆదుకోవడానికి కిరాణా సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది అన్నారు.

మెదక్‌ ‌పట్టణంలో  వలస కూలీల గురించి  వారిని ఆదుకుంటామని  వివరించారు  పారిశుద్ధ కార్మికులు  శక్తివంచన లేకుండా  పని చేస్తున్నారని  వారి కృషి  హర్షించదగ్గ విషయమని కొనియాడారు  ఆపద సమయంలో  ఆదుకున్న  వారికి  మంచి జరుగుతుందని  తెలుగు ప్రజలు  పరిశుభ్రతను పాటించే అంటువ్యాధులు ప్రబలకుండా  జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు  మెదక్‌ ‌పట్టణంలో పారిశుద్ధ్యం లోపించకుండా  24 గంటల పాటు పట్టణాన్ని  శుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ కార్మికుల తో చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిల్‌ ‌లు నార్వే లక్మి నారాయణ జయ రాజ్‌ .‌పసి .కిశోర్‌ .‌తదితరులు ఉన్నారు.

Leave a Reply