దేశంలో రెండో దశ కొరోనా వ్యాప్తి క్రమంగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. 24 గంటల్లో కొత్తగా 92,596 కొరోనా కేసులు నమోదయ్యాయి. ఇక మంగళవారం 2,219 మంది కొరోనాతో మరణించారు. మన దేశంలో కొరోనా మహమ్మారి మొదటి దశ నుంచి మొత్తం 2.9 కోట్లకు పైగానే కేసులు నమోదయ్యాయి. ఇక వైరస్ బారినపడి చనిపోయిన వారి మొత్తం సంఖ్య 3,53,528కి చేరింది. క్రియాశీల రేటు కూడా 4.67 శాతంగా ఉంది.
రాష్టాల్ర వారీగా చూస్తే గడచిన 24 గంటల్లో.. తమిళనాడులో 18,023, కేరళ 15,567, మహారాష్ట్ర 10,891, కర్ణాటక 9,808 కేసులు నమోదయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నుంచి అన్లాక్ పక్రియ అమల్లో ఉండగా..ఆ రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే కొత్తగా 316 కొరోనా కేసులు నమోదవ్వగా.. 41 మంది మరణించారు. ఇక త్రిపురలో 625 కొత్త కేసులు నమోదవ్వగా.. మణిపూర్లో 12 మందే మరణించారని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.