Take a fresh look at your lifestyle.

ఫలితాలు ఇస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుదని చెప్పి మండలంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు మంచి ఫలితాలను ఇస్తున్నాయనే చెప్పవచ్చు.మండలంలో వేసంగి వరి పంటను సాగు చేసిన దాన్యాన్ని ప్రభుత్వ మే కొనుగోలు చేసే విదంగా పలు చోట్ల దాన్యం కేంద్రాలు ఏర్పాటు చేశారు. సెర్ఫ్ ఆద్వర్యంలో గోవిందాపురం, పెద్దఆర్లగూడెం దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, దుమ్ముగూడెం పిఏసిఎస్‌ ‌ద్వారా కె. లక్ష్మీపురం గ్రామంలో ఏర్పాటు చేశారు. రైతు ముందుగా పండించిన దాన్యాన్ని వ్యవశాయ అధికారులకు తెలిపి వారి వద్ద నుండి టోకెన్‌ ‌తీసుకో వాలి. అనంతరం రైతు దాన్యాన్ని కేంద్రాల వద్దకు తరలించి తేమ శాతాన్ని పరీశీలిస్తారు.తేమ శాతం 19 కన్నా తక్కు వ ఉంటే అట్టి దాన్యాన్ని కాటాలు వేస్తారు. •క వేళ రైతులు తెచ్చిన దాన్యంలో పొల్లు, వంటివి ఉంటే ప్యాడీ క్లీనర్‌ ‌ద్వారా •డ్లు శుభ్ర పరుస్తారు. కాటా వేసిన దాన్యాన్ని లెక్క ప్రకారం రైతుకు వారం రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.

ప్రభుత్వం దళారుల చేతిల్లో నష్ట పోకుండా ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలు ఆశాజనకంగానే ఉన్నాయని చెప్పవచ్చు. గోవిందాపు రంలో: సెర్ప్ ఆద్వర్యంలో రెండు దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేయగా •క్క గోవిందాపుం కేంద్రం నుండే అత్యధిక దాన్యం కొనగోలు చేశారు. మొత్తం ఆరు లోడ్లు ద్వారా 1642 క్వింటాళ దాన్యాన్ని మిల్లర్ల తరలించినట్లు ఎస్‌ఆర్‌పి ఉషా, సిసి కృష్ణ తెలిపారు. ఇంకో 1000 క్వింటాళ్ల దాన్యం కొనుగోలు చేయనున్నట్లు వారు తెలిపారు. కాగా కె. లక్ష్మీపురం గ్రామంలో పిఎసిఎస్‌ ‌ద్వారా నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రం వద్ద ఇప్పటి వరకు మూడు లోడ్లు ద్వారా 770 క్వింటాళ్ల దాన్యాన్ని మిల్లర్ల వద్దకు తరలించినట్లు దాన్యం కొనుగోలు ఇన్‌చార్జీ సత్యనారాయణ తెలిపాడు. ఇంకో 817 క్వింటాళ్ల దాన్యం లోడుకు సిద్దంగా ఉందని మరి కొంతమంది రైతుల నుండి దాన్యం రావాల్సి ఉంది అని వారు ప్రజాతంత్రకు తెలిపారు. ఏది ఎమైనా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు మంచి ఫలితాలు ఇచ్చాయనే చెప్పవచ్చు.

Leave a Reply