జగదేవ్పూర్ మండల పిఆర్టియూ శాఖ ఆధ్వ ర్యంలో మండలం లోని పలు గుగడ్డలో మంగళ వారం పేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. పిఆర్టియూ జగదేవపూర్ మండల శాఖ చేపట్టిన నేను సైతం సమాజసేవలో కార్యక్రమంలో భాగంగా పలుగుగడలో రెండు నిరుపేద కుటుంబాలకు పిఆర్టియూ సిద్దిపేట జిల్లా శాఖ గౌరవాధ్యక్షుడు ఆదరాసుపల్లి శశిధర్ శర్మ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజేశ్వరి రవి, పిఆర్టియూ జగదేవపూర్ మండల శాఖ అధ్యక్షుడు సిహెచ్.వెంకట్రాంరెడ్డి , ప్రధాన కార్యదర్శి ఎం. రవి కుమార్, నాయకులు రవీందర్, నరేష్ ఉపసర్పంచ్ వెంకటమ్మ, నాయకులు ఉప్పలయ్య ,అంజయ్య, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.