Take a fresh look at your lifestyle.

ఆకలితో అలమటిస్తున్న కార్మికులు

మణుగూరు, పినపాక మండలాల సరిహద్దులో నిర్మిస్తున్న భద్రాద్రి పవర్‌ ‌ప్లాంట్‌ ‌నిర్మాణంలో పనిచేస్తున్న వివిధ రాష్ట్రాల కార్మికులు కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులకు ఏదుర్కొంటున్నారు. యాజమాన్యలు సరైన వసతి కల్పించడం లేదని, వేతనాలు చెల్లించడం లేదని అనేక సార్లు నిరసన తేలియజేశారు. మార్చి 21వ తేదిన కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ‌కారణంగా చూట్టు ప్రక్కల గ్రామాల సైతం సామాజిక దూరం పాటించాలని తమ గ్రామాల్లోకి రానివడం లేదని వారు ఆవేదన చెందారు. వేతనాలు ఇచ్చిన ఇవ్వకపోయిన తమ గ్రామాలకు వెళ్లి ప్రాణాలు కాపాడుకుంటామని వారు తెలిపారు.

గురువారం ఉదయం 3గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు తహసీల్దార్‌ ‌కార్యాలయం ముందు సుమారు 200 మంది కార్మికులు స్వంత గ్రామాలకు వెళ్లేందు అనుమతి కోసం ఎదురుచూశారు. అధికా రులు కార్మికులు వెళ్లిపోతే బిటిపిఎస్‌ ‌నిర్మాణ పనులు మరింత ఆలస్య మోతాయని, వారితో పనులు చేప ట్టేందుకు శతవిధాల ప్రయత్నిం చారు. స్థానిక బిటిపిఎస్‌ ‌సీఈ బాల రాజు, ఏఎస్పి శభారిష్‌, ఆర్డివో స్వర్ణలత మరియు ఇతర ఉన్నతా ధికారులు ప్రయత్నించారు. ఆర్డివో ఉదయం నుండి తహసీల్దార్‌ ‌కా ర్యాలయం వుండి కార్మికులతో సంప్రదింపులు చేశారు. అధికారుల మాట లెక్కచేయకుండా వెళ్లి పోయారు.

Leave a Reply