Take a fresh look at your lifestyle.

24 ‌గంటల్లో 81,466 కోవిడ్‌ ‌పాజిటివ్‌ ‌కేసులు

  • కొరోనా పెరుగదలపై సర్వత్రా ఆందోళన
  • కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం
  • రాష్ట్రాల సిఎస్‌లతో కేంద్ర కార్యదర్శి రాజీవ్‌ ‌గౌబ వీడియో కాన్ఫరెన్స్
  • అధిక సంఖ్యలో టెస్టులు నిర్వహించాలి
  • 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్‌ ‌చేయించాలని సూచన

‌కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేబినెట్‌ ‌కార్యదర్శి రాజీవ్‌ ‌గౌబ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. దేశంలో కొరోనా కేసులు రోజురోజుకూ అధికం అవుతున్న నేపథ్యంలో వివిధ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో శుక్రవారం ఆయన ఢిల్లీ నుండి వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాజీవ్‌ ‌గౌబ మాట్లాడుతూ ముఖ్యంగా 8 రాష్ట్రాల్లో కోవిడ్‌ ‌కేసులు ఆందోళన కలిగించే రీతిలో ఉన్నాయని ఈ పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాలు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని సిఎస్‌లకు స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమిక్షించుని అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా అధిక సంఖ్యలో కొరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించాలని కేబినెట్‌ ‌కార్యదర్శి రాజీవ్‌ ‌గౌబ సిఎస్‌లను ఆదేశించారు. అదే విధంగా పటిష్టమైన కంటైన్మెంట్‌ ‌చర్యలు చేపట్టడంతో పాటు వ్యాక్సినేషన్‌ ‌పక్రియను వేగవంతం చేయాలని చెప్పారు.

గురువారం ఒక్కరోజే దేశంలో 81 వేల కరోనా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంతటి తీవ్ర స్థాయికి చేరిందో అర్థం అవుతుందని అన్నారు. 45 యేళ్ళు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్‌కు అనుమతి ఇచ్చినందున వారికందరికీ పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ అం‌దించాలని చెప్పారు. కొరోనా నిర్థారణ అయినవారికి తగిన వైద్య సేవలు అందించడమే గాక వారితో సన్నిహితంగా మెలిగిన వారిని కూడా మూడు రోజుల్లోగా గుర్తించి వారిని హోం ఐసోలేషన్లో ఉంచాలని రాజీవ్‌ ‌గౌబ స్పష్టం చేశారు. అంతేగాక గ్రామ స్థాయి నుండి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయాలని చెప్పారు. అయా వైద్యశాలల్లో మరిన్ని ఐసోలేషన్‌, ఆక్సిజన్‌ ‌పాఠకులను అందుబాటులో ఉంచాలని సూచించారు. మార్కెట్లు, మాల్స్, ‌రాజకీయ, సాంస్కృతిక, ప్రార్థనాపరమైన కార్యక్రమాలు జరిగేచోట్ల ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్‌కను ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని రాజీవ్‌ ‌గౌబ సిఎస్‌లకు స్పష్టం చేశారు.

విజయవాడ సిఎస్‌ ‌క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్‌ ‌దాస్‌, ‌వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ ‌కె.భాస్కర్‌ ‌వీడియో సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు పాజిటివ్‌ ‌కేసులతో పాటు మరణాలు పెరుగుతున్నాయి. గురువారం రికార్డు స్థాయిలో మరణాలు నమోదవగా.. తాజాగా మరోసారి పెద్ద ఎత్తున జనం మహమ్మారికి బలయ్యారు. గడిచిన 24 గంటల్లో 81,466 కొవిడ్‌ ‌పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. గతేడాది అక్టోబర్‌ ‌మొదటి వారం తర్వాత ఇన్ని కేసులు రికార్డవడం ఇదే తొలిసారి. దేశంలో ఎన్నడూ లేని విధంగా 24 గంటల్లో 469 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 1,23,03,131కు పెరిగింది. తాజాగా 50,356 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 1,15,25,039 కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 6,14,696 యాక్టివ్‌ ‌కేసులున్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటి వరకు 1,63,396 మంది మరణించారని చెప్పింది. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 6,87,89,138 డోసులు వేసినట్లు వివరించింది. దేశంలో పెరుగుతున్న కొవిడ్‌ ‌కేసులతో కేంద్రం అప్రమత్త మైంది. కేసుల పెరుగుదల కనిపిస్తున్న పదకొండు రాష్ట్రాల ప్రతినిధులతో కేంద్ర కేబినెట్‌ ‌కార్యదర్శి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైరస్‌ ‌కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply