Take a fresh look at your lifestyle.

80‌శాతం డబుల్‌ ఇళ్ల నిర్మాణాలు పూర్తి సమీక్షలో మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడి

హైదరాబాద్‌,‌మే20(ఆర్‌ఎన్‌ఎ): ‌తెలంగాణ ప్రభుత్వం డబుల్‌ ‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని స్పష్టం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌చేశారు. హైదరాబాద్‌లో చాలా చోట్ల 80 శాతానికి పైగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయని తెలిపారు. ఇప్పటికే కొన్ని చోట్ల లబ్దిదారులకు డబుల్‌ ‌బెడ్‌రూం ఇండ్లను పంపిణీ చేశామని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే మిగిలిన నిర్మాణాలను పూర్తి చేసి లబ్దిదారులకు పంపిణీ చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌ ‌నగరంలో నిర్మిస్తున్న డబుల్‌ ‌బెడ్‌రూం ఇండ్లపై ఎంసీహెచ్‌ఆర్‌డీలో మంత్రి కేటీఆర్‌ ‌సక్ష నిర్వహించారు.

ఈ సక్షా సమావేశానికి మంత్రులు మహముద్‌ అలీ, వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌మల్లారెడ్డి, జీహెచ్‌ఎం‌సీ మేయర్‌ ‌బొంతు రామ్మోహన్‌తో పాటు పురపాలక, హౌసింగ్‌ ‌శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నచోట త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎక్కడా ఆలస్యం లేకుండా పనులు సాగాతన్నారు. పేదలకు త్వరగా అందించేలా కార్యాచరణ చేయాలన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy