Take a fresh look at your lifestyle.

‘‌పది’ తరహాలోనే 8,9 విద్యార్థులకు పరీక్షలు జగిత్యాల కలెక్టర్‌ ‌శరత్‌

district collectors, bank manager, drda pd lakshmi narayana
విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ‌శరత్‌

పదవ తరగతి విధ్యార్థులకు నిర్వహించే పరీక్షా విధానంలోనే ఎనిమిది, తొమ్మిది తరగతుల విధ్యార్థులకు పరీక్షలను నిర్వహించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్‌ ‌డాక్టర్‌ ‌శరత్‌ అన్నారు. గురువారం  జిల్లాలో నిర్వహించిన స్టేట్‌ ‌లెవల్‌ అసెస్మెంట్‌ ‌సర్వేపై విధ్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం అయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విధ్యార్థులకు పదోతరగతి పరీక్షా విధానంలోనే ఎనిమిది, తొమ్మిది తరగతుల విధ్యార్థులకు పరీక్షలను నిర్వహించాలన్నారు. ఈనెల 28న ఈ తరహా పరీక్షా పత్రాలు జిల్లాకు చేరుతాయని వీటిని సంబందిత పోలీస్‌ ‌స్టేషన్లో బద్రపరచాలని కలెక్టర్‌ అదేశించారు. ఈనెల 30న ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఈ విధానంలో నిర్వహించే పరీక్ష నిర్వహాణకు ఏర్పాట్లు చేయాలని పదోతరగతి వార్షిక పరీక్షలను ఏ విధంగా నిర్వహిస్తామో అదే రీతిలో వీటిని నిర్వహిం చాలని కలెక్టర్‌ ‌సూచించారు.ఈ పరీక్షలను సక్రమంగా నిర్వహించేందుకు విధ్యాశాఖతోపాటు జిల్లాలోని ప్రతి మూడు మండలాలకు ఓక ప్రత్యేక అధికారి చొప్పున జిల్లాలోని 18 మండలాలకు నియమిస్తామని పరీక్షలను ఏ విధమైన లోపాలు లేకుండా చూడాలని ఆయా సబ్టెక్టు టీచర్లకు అయా పరీక్ష డ్యూటిలను వేయరాదని కలెక్టర్‌ అదేశించారు. ఈకార్యక్రమములో జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌బి.రాజేశం, డిఆర్‌వో అరుణశ్రీ, ఏవో వెంకటేష్‌, ‌డిఈవో వెంకటేశ్వర్లు, డిఎస్‌పి, ఎంఈవోలు ఉన్నారు.

ట్రాక్టర్ల మంజూరీలో అలసత్వం వీడాలి
ట్రాక్టర్ల కొనుగోలుపై బ్యాంకులు తమ విధానాలను మార్చుకోవాలని, సకాలంలోనే ఏజన్సీలు పంచాయతీ లకు ట్రాక్టర్లను సరఫరా చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్‌ ‌డాక్టర్‌ ‌శరత్‌ అన్నారు. గురువారం కలెక్టరేటు చాంబర్‌లో జిల్లాలోని పల్లెప్రగతి పనుల్లో ట్రాక్టర్ల కొను గోలుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈసంద ర్బంగా కలెక్టర్‌ ‌గ్రామపంచాయితీ వారీగా ట్రాక్టర్ల కొనుగోలు ఆంశాలను అడిగి తెలుసుకొన్నారు. అనం తరం మార్జిన్‌మని చెల్లించినా ట్రాక్టర్లకు మంజూరి ఇవ్వని బ్యాంకుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలాగే బ్యాంకులు మంజూరి ఇచ్చినా ట్రాక్టర్లను సరఫరా చేయని ఏజన్సీల సమాచారాన్ని సేకరించారు. అనంతరం అయన మాట్లాడుతూ ట్రాక్టర్ల కు మంజూరి ఇవ్వని బ్యాంకులు తమ విధానాలను మార్చుకోవాలని, ఎజన్సీలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే వాటి ఎజన్సీలను రద్దు చేసి కొత్త ఎజన్సీలకై పంచాయతీలలో తీర్మానం చేసే ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్‌ అన్నారు.   డిఆర్‌డిఏ పిడి లక్ష్మినారా యణ, డిపివో శేఖర్‌, ‌లీడ్‌ ‌బ్యాంకు మేనేజర్‌ ‌గౌతమ్‌ ‌లక్ష్మినారాయణ, బ్యాంకు మేనేజర్లు, మండల పంచాయి తీ అధికారులు, ట్రాక్టర్ల ఎజన్సీలు పాల్గోన్నారు.

Tags: district collectors, bank manager, drda pd lakshmi narayana

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply