Take a fresh look at your lifestyle.

అం‌బటి ఎల్లం గౌడ్‌ ‌హత్యకేసును ఛేదించిన పోలీసులు

గత నెల సిద్ధిపేట పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలోని రామంచ శివారులో జరిగిన రౌడీ షీటర్‌ అం‌బటి ఎల్లంగౌడ్‌ ‌హత్య కేసును ఎట్టకేలకు సిద్ధిపేట రూరల్‌ ‌పోలీసులు ఛేదించారు. హత్య చేసిన 8మందిలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు రిమాండు చేశారు. పోలీసులు తెలిపన వివరాల ప్రకారం…గత నెల 23న రాత్రి 10గంటల సమయంలో ఇమాంబాద్‌కు చెందిన అంబటి ఎల్లంగౌడ్‌ (40)‌చిన్నకోడూర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని రామంచ గ్రామ శివారులో హత్యకు గురైన విషయం విధితమే. విషయం తెలుసుకున్న పోలీస్‌ ‌కమిషనర్‌ ‌డి. జోయల్‌ ‌డేవిస్‌ ‌సంఘటన స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. వెంటనే డాగ్స్ ‌స్క్వాడ్‌, ‌క్లూస్‌ ‌టీమును పరిశోధన చేయాలని ఆదేశించారు. హత్య కేసును ఛేదించడానికి సిద్దిపేట సిద్దిపేట్‌ ఏసిపి రామేశ్వర్‌, ‌సిద్దిపేట రూరల్‌ ‌సిఐ సురేందర్‌ ‌రెడ్డి, చిన్నకోడూరు ఎస్‌ఐ ‌సాయి కుమార్‌, ‌సిబ్బందితో కలసి స్పెషల్‌ ‌టీమును ఏర్పాటు చేసినారు. హత్య కేసును అన్ని కోణాల్లో పరిశోధన చేయాలని ఆదేశించారు. కమిషనర్‌ ఆదేశానుసారం అధికారులు పరిశోధన ప్రారంభించారు. తన భర్త ఎల్లంగౌడ్‌ ‌హత్యకు గురి కావడానికి ఆరుగురిపై అనుమానం ఉన్నదని మృతుని భార్య భారతి తోడేంగుల వెంకటేష్‌, ఎడ్ల మధుసూదన్‌ ‌రెడ్డి, బెజగామ సంతోష్‌ ‌కుమార్‌, ‌సింగిరెడ్డి సంపత్‌ ‌రెడ్డి, నరెడ్ల మధుసూదన్‌ ‌రెడ్డి, స్వామి అనుమానం ఉన్నదని దరఖాస్తు ఇవ్వగా చిన్న కోడూరు ఎస్‌ఐ ‌సాయికుమార్‌ ‌కేసు నమోదు చేసి సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్‌, ‌సిద్దిపేట రూరల్‌ ‌సురేందర్‌ ‌రెడ్డి, కేసు పరిశోధన ప్రారంభించారు.

ఏసిపి ఆధ్వర్యంలో స్పెషల్‌ ‌టీములు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్న క్రమంలో ఈ నెల 3న ఎల్లం గౌడ్‌ను మేమే హత్య చేశామని తొడేంగుల వెంకటేష్‌(‌తడకపల్లి), బెజ్జంకి సంతోష్‌కుమార్‌(‌సిద్ధన్నపేట), కాస స్వామి (పెద్దమాసాన్‌పల్లి) ముగ్గురు వ్యక్తులు సిద్దిపేట ఏసిపి కార్యాలయంలో లొంగిపోయారు. సిద్దిపేట ఏసిపి రామేశ్వర్‌, ‌సిద్దిపేట రూరల్‌ ‌సిఐ సురేందర్‌ ‌రెడ్డి కేసు పరిశోధనలో భాగంగా ముగ్గురిని అన్ని కోణాల్లో ఇంటరాగేషన్‌ ‌చేయగా, ఎల్లం గౌడ్‌ ‌హత్య కేసులో తొడేంగల వెంకటేష్‌, ఎడ్ల మధుసూదన్‌ ‌రెడ్డి(రామంచ), కాస స్వామి, బెజ్జంకి సంతోష్‌ ‌కుమార్‌, ‌చెన్నోజు నవీన్‌ (‌మిట్టపల్లి), ఆడే సంతోష్‌ (‌మిట్టపల్లి),చేట్టుగురి రవి(ఖానాపూర్‌), ‌కార్మి అనిల్‌(‌రాంనగర్‌నగర్‌, ‌సిద్దిపేట)7 గురం కలిసి హత్య చేస్తామని ఒప్పుకున్నారు. ఎల్లంగౌడ్‌ ‌హత్యకు డబ్బులు పంచుకునే విషయంలో వివాదాలు తలెత్తాయనీ పోలీసులు తెలిపారు. మిగతా నిందితులు పరారీలో ఉన్నారు.

Leave a Reply