Take a fresh look at your lifestyle.

గైర్హాజరైన సిబ్బందిపై కఠిన చర్యలు

కరోనా రెడ్‌ ‌జోన్‌లో సమయంలో మన జిల్లాలో అధికారులు మాత్రమే పనులు నిర్వహణ భాధ్యత తీసుకున్నారని ప్రస్తుతం గ్రీన్‌ ‌జోన్‌లో ఉన్నందున ప్రతీ ఒక్క అధికారి సిబ్బంది కార్యాలయానికి వచ్చి తమ విధులు నిర్వహించాలని గౌర్హాజరు అయిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఐటిడిఏ పిఓ గౌతమ్‌ ‌పొట్రూ అన్నారు. సోమవారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో ఐటిడిఏలో యూనిట్‌ ఆఫీసర్లు సిబ్బందితో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసారు. అనంతరం ఆయన అధికారులు సిబ్బంది కార్యస్థానం విడిచి వెళ్ళకుండా అందరు అందుబాటులో ఉండాలని , కరోనా వైరస్‌ ‌గురించి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. యూనిట్‌ ఆఫీసర్ల ఆదీనంలో పనిచేస్ను•త్న సిబ్బంది తో పనులు చేయించే భాధ్యత తప్పకుండా యూనిట్‌ ఆఫీసర్లు తీసుకోవాలని అన్నారు.

ప్రతీ ఒక్కరు సామాజిక దూరం పాటించి మాస్కులు విధులు నిర్వహించే సిబ్బంది అందరికి పంపిణీ చేయాలని ఏఓ భీమ్‌కు ఆదేశించారు. ప్రస్తుతం మన జిల్లా గ్రీన్‌ ‌జోన్‌లో ఉందని ఆంధ్రా ప్రాంతం మనకు దగ్గరగా ఉన్న భద్రాచలం చుట్టు ప్రక్కల మండలాల్లో కరోనా వ్యాధిన పడిన వారు ఎవరు లేనందున భయపడాల్సిన పనిలేదని అన్నారు. ఎవరికైన కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్ళి టెస్టులు చేయించుకుంటే భయం, బెదురు మనలోని అపోహలు తొలగిపోతుందని అన్నారు. ఆర్టికల్‌ 275 ‌కు సంబంధించిన పనుల ఫైల్స్ ఉం‌టే పూర్తి చేయాలని , అదేవిధంగా ఇంజనీరింగ్‌కు సంబంధఙంచిన ఎస్‌యంసీ యూనిట్స్ , ఎల్‌టిఆర్‌ ‌కేసులు ఆర్వోఎఫ్‌ఆర్‌ ‌ద్వారా రైతు బందుకు సంబంధించిన ఫైల్సు పెండింగ్‌లో ఉన్నవ త్వరిత గతిన పూర్తి చేయాలని అన్నారు. పాత గైడ్‌లైన్స్ ‌ప్రకారం పనులు ప్రారంభించాలని అన్నారు. ఫైల్స్ ‌విషయంలో యూనిట్‌ అధికారులు సిబ్బంది నిర్లక్ష్య వైఖరి కనపడకుండా చాలా జాగ్రత్తగా ప్రతీ ఒక్కరు పనిచేసి లబ్దిదారులకు ఐటిడిఏ పథకాలు సకాలంలో అందేల చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ భీమ్‌, ‌మేనేజర్‌ ‌సురేంధర్‌, ‌డిడిటిడబ్ల్యూ జహీరుద్దీన్‌, ఆర్‌సిఓ గురుకులం బురాని, పియంఆర్‌సి రమణయ్య, డియంజిసిసి వాణి, ఇఇటిడబ్ల్యూ రాములు, ఏపిఓ అనురాధ, ఏడిఏ సుజాత, ఎస్‌ఓ ‌సురేష్‌, ఆర్వోఎఫ్‌ఆర్‌ శ్రీ‌నివాస్‌, ‌క్రీడాధికారి వీరునాయక్‌, ‌మరియు ఇతర శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!