Take a fresh look at your lifestyle.

కాళేశ్వరం రాష్ట్రానికే అన్నపూర్ణ వంటిది : ఈటల

కాళేశ్వ రం ప్రాజెక్టు తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్నపూర్ణ వంటిదని రాష్ట్ర వైద్య అరోగ్య శాఖ మంత్రి ఈ•ల రాజేందర్‌ అన్నారు. గు రువారం మంత్రి ఈటల నేతృ త్వంలోని ఇరిగేషన్‌ ‌ప్రిన్సిపాల్‌ ‌సెక్రెటరీ రజత్‌కుమార్‌,‌సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌,ఇరిగేషన్‌ ‌సలహదారు పెంటారెడ్డిలతో కలిసి కన్నేపెల్లి పంపు హౌజ్‌ను సందర్వించి పం ప్‌ ‌హౌజ్‌ ‌నిర్మాణ పనులను పరి శీలించారు. హెలీక్యాప్టర్‌ ‌ద్వారా మంత్రి, ఆయన బృందం హైద రాబాద్‌ ‌నుండి కన్నేపల్లి చేరుకోగా జిల్లా కలెక్టర్‌ ‌మహ్మద్‌ అబ్దుల్‌ అజీం, జిల్లా ఎస్సీ డాక్టర్‌ ‌సంగ్రా మ్‌ ‌సింగ్‌ ‌గణపతిరావు పాటిల్‌ ‌లు స్వాగతం పలికారు. ముందు గా పంప్‌హౌజ్‌ ‌నిర్మాణంలో ఉన్న మిషనరీల ను పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి ఈటల రాజేందర్‌ ‌మాట్లాడుతూ నిర్దేశిత లక్ష్యం మేరకు కన్నేపల్లి పంప్‌హౌజ్‌ ‌నుండి నీటిని తరలించేందుకు ప్రభుత్వ అదేశాల మేరకు ఇప్పటికే పనులు చేపట్టడం జరిగిందన్నారు.

కరోనా లాక్‌ఢౌన్‌ ‌నేపద్యం లో నిలిచిపోయిన పనులు మిషనరీలు రావడానికి ఇబ్బంది కలుగడంతో పెండింగ్‌లో ఉన్నపనులను లాక్‌డౌన్‌ ఎత్తి వేయగానే ప్రభుత్వ అదేశాల మేరకు పనులను వేగవంతం చేసి వానాకాలం పంటల నాటికి పూర్తి స్థాయిలో నీటిని తరలించేలా అధికారులుచర్యలు చేపట్టాలన్నారు. అనంతరం జిల్లాలో వరి ధాన్యం కోనుగోలు సమయంలో కోత విధిం చకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను అదేశించారు. జిల్లాలో 3 కరోనా కేసులు నమోదు కాగ వారిలో ఇద్దరికి నయమై గాంధీ ఆసుపత్రి నుండి తిరిగి ఇండ్లకు చేరారని, ఒక్కరు మాత్రం ఆసుపత్రిలోనే చికిత్స పోందుతున్నారన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఒక్క కంటై న్మెంట్‌ ‌జోన్‌ను కూడ తోలగించడం జరిగిందని, జిల్లాలో కరోనా వైర స్‌ ‌రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు.ఈ కార్యక్రమం లో కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్‌ఇ ‌రమణారెడ్డి, భూపాలపల్లి ఆర్‌డివో వైవి గణేష్‌, ‌మహదేవ్‌పూర్‌ ఎం‌పిపి రాణా భాయి, కాళేశ్వరం ఎంపిటిసి మమత,అధికారులు పాల్గోన్నారు.

Leave a Reply