Take a fresh look at your lifestyle.

ఏడాది చివరికి.. 75వేల డబుల్‌ ఇళ్లు

  • పార్టీ ఎమ్మెల్యేలతో మంత్రి కెటిఆర్‌ ‌సమీక్ష
  • సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష
ఈ ఏడాది చివరి నాటికి సుమారు 75 వేల డబుల్‌ ‌బెడ్‌రూం ఇండ్లు పంపిణీకి సిద్ధమవుతాయని ఎమ్మెల్యేలకు కేటీఆర్‌ ‌తెలిపారు. అన్నింటికీ సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి హా ఇచ్చారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ ‌పరిధిలోని ఎమ్మెల్యేలతో రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌ ‌సక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన పనులను ఎమ్మెల్యేలు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ..ప్రతి నియోజకవర్గంలో వైకుంఠధామాల ఏర్పాటు, చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. లాక్‌డౌన్‌ ‌సమయాన్ని చక్కగా వినియోగించుకుని జీహెచ్‌ఎం‌సీ రోడ్ల లేయింగ్‌, ‌నిర్మాణ పనులను పూర్తి చేశామని కేటీఆర్‌ ‌తెలిపారు. ఈ విషయంలో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా నిర్మించిన పలు పనుల ద్వారా చాలాచోట్ల ట్రాఫిక్‌ ‌కష్టాలు తప్పాయన్నారు. ముఖ్యంగా ఎల్బీనగర్‌ ‌చౌరస్తా వంటి పలు చోట్ల మొత్తం రూపురేఖలు మారిపోయాయని, అంత వేగంగా ఇన్‌‌ఫ్రాస్టక్చ్రర్‌ ‌పనులు పూర్తయ్యాయని, ఫుట్‌పాత్‌లు, టాయిలెట్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న శానిటేషన్‌ ‌పనులు, జలమండలి సివరేజ్‌ ‌నిర్వహణపై మంత్రి కేటీఆర్‌ ‌సంతృప్తి వ్యక్తం చేశారు.
సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధిపై అధికారులతో సక్ష:
సిరిసిల్ల పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని మంత్రి కేటీఆర్‌ ‌సూచించారు. ఆ దిశగా అధికార యంత్రాంగం పని చేయాలని ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి పనులపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌ ‌సక్షా సమావేశం నిర్వహించారు.  ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చేలా ప్రభుత్వ సేవలు ఉండాలన్నారు. ప్రజారోగ్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని యంత్రాంగానికి కేటీఆర్‌ ‌సూచించారు. సిరిసిల్లలో అభివృద్ధి పనులను పరుగులెత్తించాలంటూ సిరిసిల్లలో సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల పురోగతిని కేటీఆర్‌ ‌తెలుసుకున్నారు. సిరిసిల్లలో చెరువులన్నీ నిండాయి..మంచి పంటలు పండే అవకాశం ఉందన్నారు. కోవిడ్‌ ‌బాధితులకు అందిస్తున్న చికిత్స గురించి ఆయన తెలుసుకున్నారు. సిరిసిల్లకు అవసరమైన మందులను అందిస్తామన్నారు. క్లస్టర్‌ ‌హాస్పిటళ్లపై మరింత దృష్టి పెట్టాలని కేటీఆర్‌ ‌సూచించారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, బండలింగంపల్లి పీహెచ్‌సీలను వేగంగా నిర్మించాలని ఆదేశించారు. విలీన గ్రామాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా కొనసాగించాలని చెప్పారు. సిరిసిల్ల జిల్లాలో రైతు వేదికల నిర్మాణ పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. 154 గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రకృతి వనాల పనుల తీరుపై కేటీఆర్‌ ఆరా తీశారు.

Leave a Reply