Take a fresh look at your lifestyle.

కే. రాఘవేంద్రరావు అద్భుత సృష్టి..!

  • జగదేక వీరుడు- అతిలోక సుందరి..
  • వృత్తి, ప్రవృత్తి ఒకటైతే అది ఉద్యోగంలానిపించదనే నానుడి ఉంది.

ఇది ప్రఖ్యాత సినీ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు విషయంలో వర్తిస్తుంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, వెండితెర శ్రీకృష్ణుడు నందమూరి తారకరామారావుపై క్లాప్ కొట్టమని రాఘవేంద్రరావుని అడిగినప్పుడు భవిష్యత్ తన వృత్తి అదే అవుతుందని ఆయన ఊహించలేదు. చిత్రనిర్మాణ రంగం అంటే ఆయనకు అంత అభిమానం. అప్పుడు ఆ అవకాశం ఎన్నో ముఖ్య సంఘటనలకు, మలుపులకూ దారి తీసిందని రాఘవేంద్రరావు అంటారు. సినీ రంగంలో శుక్రవారం సెంటి మెంట్ బలపడటానికి కూడా కారణమైందని ఆయన అన్నారు. అప్పటికి ఆయన ఇరవై ఏళ్ల ప్రాయంలో ఉన్నారు. మద్రాసు ( ఇప్పుడు చెన్నై) వాహినీ స్టూడియోలో 1964లో నడి వేసవిలో ఓ రోజు ఈసంఘటన జరిగింది.

చలన చిత్ర రంగంలో ఎంతో ఉన్నత స్థితికి చేరుకోవాలని అప్పటికే కలలు కంటున్న రాఘవేంద్రరావుకు 1965లో పాండవవనవాసం చిత్రంలో ఎన్టీఆర్ భీమసేన పాత్రపై క్లాప్ కొట్టే బాధ్యతను అప్పగించారు. ఆ సీన్ ను ఇంటర్వెల్ షాట్ గా తీశారు.రాఘవేంద్రరావు తండ్రి కె సూర్య ప్రకాశరావు తెలుగు చలనచిత్ర రంగంలో ప్రఖ్యాతి వహించిన దర్శక, నిర్మాత, కెఎస్ ప్రకాశరావుగా పేరొందిన ఆయన, కోటేశ్వరమ్మలు రాఘవేంద్రరావు తల్లితండ్రులు. అప్పటి నుంచి ఆయన సినీ రంగంపై మరింత ఆసక్తిని పెంచుకుని వాణిజ్య చిత్రాల నిర్మాణంలో నైపుణ్యానికి మెరుగులు దిద్దుకున్నారు. కెఎస్ ప్రకాశరావు తెలుగు, తమిళ, కన్నడ తదితర రంగాల్లో 40 పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ తో విచిత్ర కుటుంబం, అక్కినేనితో ప్రేమనగర్, వంటి కమర్షియల్ సినిమాలు తీశారు.

రాఘవేంద్రరావు ఆ తర్వాత దశాబ్దంపాటు నిరీక్షించాల్సి వచ్చింది. 1975లో శోభన్ బాబు, వాణిశ్రీ లతో బాబు చిత్రాన్నినిర్మించారు. దానికి మిశ్రమ స్పందన లభించింది. ఆ సమయంలో శోభన్, వాణిశ్రీ కాంబినేషన్ లో వచ్చిన జీవనజ్యోతి సూపర్ హిట్ అయింది. ఆ ప్రవాహంలో ఈ సినిమా కొట్టుకుని పోయింది. ఆ తర్వాత , రాజా, కల్పన వంటి చిత్రాలకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. భారీ చిత్రానికి డైరక్టర్ కావాలన్న ఆయన కోరిక సత్యచిత్ర బ్యానర్ పై వచ్చిన అడవిరాముడు సినిమాతో నెరవే రింది. ఈ చిత్రానికి ఎన్టీఆర్ సుదీర్ఘమైన షెడ్యూల్స్ ఇచ్చారు. మధుమలై అడవుల్లో 40 రోజుల పాటు సింగిల్ షెడ్యూల్ ఇచ్చారు. అడవి రాముడు సినిమాతో రాఘవేంద్రరావు దశ మారిపోయింది. కమర్షియల్ సినిమాల దర్శకునిగా మంచి పేరు వచ్చింది. ఈ చిత్రంతో ఆయనకు దర్శకేంద్రుడనే పేరు వచ్చింది. ఆ తర్వాత ఆయన అగ్రశ్రేణి దర్శకుల జాబితాలో చేరారు ఆ తర్వాత ఎన్టీఆర్ నాయకునిగా నటించిన డ్రైవర్ రాముడు, కొండవీటి సింహం. జస్టిస్ చౌదరి, మేజర్ చంద్రకాంత్ వంటి చిత్రాలు రాఘవేంద్ర రావును మరింత ఉన్నత స్థితికి చేర్చాయి. ఆ తర్వాత ఆయన మరో మెగా మూవీకి దర్శకత్వం వహించి మరింత పేరు సంపాదించుకున్నారు.

మెగా స్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేక వీరుడు,అతిలోక సుందరి ఆయన దర్సకత్వం వహించిన సినిమాల్లో బ్లాక్ బస్టర్. ఈ చిత్రానికి మొదట్లో ఏవరేజ్ టాక్ వచ్చింది. తర్వాత తుపాను సదృశ్యంగా కాసుల వర్షం కురింది. ఆ చిత్రం ఎన్ని సార్లు విడుదలైనా జనం చూస్తూనే ఉన్నారు. అందులోని పాటలు యువతను ఇప్పటికీ ఉర్రూత లూగిస్తాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయన స్టార్ డైరక్టర్ అయ్యారు. ఆయన చిత్రంలో కెరీర్ ప్రారంభించిన హీరోయిన్లు బాలీవుడ్ హీరోయిన్లుగా ఖ్యాతి గడిస్తారన్న సెంటిమెంట్ బలపడింది. ఆ తర్వాత నాగార్డునను అన్నమయగా, భక్తరామదాసుగా , బాలకృష్ణతో పాండురంగనిగా చిత్రాలు తీసి పేరు గడించారు. తెలుగు చలనచిత్ర రంగంలో లెజెండ్ గా స్థిరపడ్డారు.
ఏ.భూపాల్ రెడ్డి

Leave a Reply