Take a fresh look at your lifestyle.

 ఘనమైన గణతంత్రం

(73వ భారత గణతంత్ర వేడుకల సందర్భంగా)

కులాల కుమ్ములాటలు
మతాల ముళ్ళకంపలు
ప్రాంతీయ విషవలయాలు
భాషాదురభిమాన దయ్యాలు !
అవినీతి కీచకరాజులు
అమానవీయ అరాచకాలు
నిరక్షరాస్యతల జబ్బులు
అసమానతల ఆర్థిక గోడలు !
ఉగ్రవాదుల ఉన్మాదాలు
జనాభా విస్పొటనాలు
బడుగుల ఆకలి కేకలు
బరువెక్కిన బతుకులు !
యువనిరుద్యోగుల నీరసాలు
కాలుష్య గరళ భూతాలు
భావకాలుష్య బాగోతాలు
సోషల్‌ మీడియా వెర్రితలలు !
కార్బన్‌ ఉద్గార ఊడలు
బక్కచిక్కిన భారత బాలలు
బరువెక్కిన స్థూలకాయలు
అభద్రత వలలో మహిళలు !
తరిగిన ప్రజారోగ్యాలు
ఇంకిన నీటి కుళాయీలు
పారిశుద్ధ్య కంపు వాసనలు
వలసల ఒడువని దుఃఖాలు !
సమస్యల తీవ్ర సంక్షోభాలు
భారతావనికే పెనుశాపాలు
అంతరించిన నైతిక విలువలు
మాయమైన మానవీయతలు !
కాలుష్యాన్ని కడిగే అడుగులు
చీకట్లను చిదిమే యోధులు
విలువల యువభారత ధీరులు
సుస్థిరాభివృద్ధికే కావాలి ఊతాలు !
దేశభక్తిని నిత్యం శ్వాచించి..
నైపుణ్యాలను అనుక్షణం శోషించి..
పరహితాన్ని తన మతమని..
నిర్మిద్దాం సౌభాగ్య భారతిని !
                           మధుపాళీ 
              కరీంనగర్‌ – 9949700037

Leave a Reply