ప్రెస్‌క్లబ్‌లో మీడియా అకాడమీ సభ్యుడు కొమురవెళ్లి అంజయ్య, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కలకుంట్ల రంగాచారి తదితరులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మైత్రి వనంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, బిజెపి జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్ధిపేటలోని చారిత్రాత్మక బురుజు త్రివర్ణ శోభితంతో కళకళలాడింది. మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రత్యేక చొరవతో పురాతన బురుజును అభివృద్ధి చేయడంతో పాటు ఆధునీకరించారు. దీంతో ఈ పురాతన బురుజుకు పూర్వవైభవం రావడమే కాకుండా దేశభక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. త్రివర్ణ రంగులతో సిద్ధిపేట పట్ణం కొత్త శోభను సంతరించుకుంది.
సిద్ధిపేట జిల్లా వ్యాప్తంగా గణతంత్ర (రిపబ్లిక్ డే)దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారి జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో మంత్రి తన్నీరు హరీష్‌రావు తన స్వగృహంతో పాటు చారిత్రత్మక బురుజై జాతీయ జెండాను ఆవిష్కరించారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో కలెక్టర్ పరపతి వెంకట్రామరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించగా పోలీస్ కమిషనరేట్‌లో పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మునిసిపల్ కార్యాలయంలో ఇంఛార్జి కమిషనర్ రమణాచారి జాతీయ జెండాను ఆవిష్కరించగా ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా డైరెక్టర్, కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డితో పాటు టిఆర్ఎస్ నేత ధర్మవరం బ్రహ్మం, పలువురు కౌన్సిలర్లు, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో డిటివో చిట్టి రామేశ్వర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.