Take a fresh look at your lifestyle.

మద్యం సేవించి వాహనాలు నడిపిన 72మందిపై కేసులు నమోదు

72 cases have been registered For Drank and Drive
‌డ్రంక్‌ అం‌డ్‌ ‌డ్రైవ్‌ ‌పరీక్ష నిర్వహిస్తున్న పోలీసులు

నూతన సంవత్సరం పురష్కరించుకొని సిద్దిపేట పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలో 31 అర్థరాత్రి నుండి జనవరి 1 తెల్లవారు జాము వరకు పోలీసులు డ్రంక్‌ అం‌డ్‌ ‌డ్రైవ్‌ ‌స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌నిర్వహించారు. తనిఖీలల్లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 72 మందిపై పోలీసు కేసులు నమోదు చేశారు.  వివిధ పోలీస్‌ ‌స్టేషన్‌ల పరిధిలో నమోదు చేసిన కేసుల వివరాలు సిద్దిపేట ట్రాఫిక్‌ ‌పీఎస్‌ 32, ‌గజ్వేల్‌ ‌ట్రాఫిక్‌ ‌పీఎస్‌ 16, ‌బెజ్జంకి 5, దుబ్బాక 4, భూంపల్లి 2, గజ్వేల్‌ ‌టౌన్‌ 5, ‌జగదేవపూర్‌ 3, ‌గౌరారం 4, హుస్నాబాద్‌ 1 ‌కేసు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటనలో తెలిపారు.

ట్రైనీ ఐపీఎస్‌ అఖిల్‌ ‌మహాజన్‌ ‌డ్రంక్‌ అం‌డ్‌ ‌డ్రైవ్‌ ‌స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌లో పాల్గొన్నారు అనంతరం అధికారులు సిబ్బంది అంబేద్కర్‌ ‌చౌరస్తాలో నూతన సంవత్సరం సందర్భంగా ట్రైనీ  ఐపీఎస్‌ అఖిల్‌ ‌మహాజన్‌, ‌ట్రాఫిక్‌ ఏసీపీ బాలాజీ, వన్‌ ‌టౌన్‌ ‌సీఐ సైదులు, ట్రాఫిక్‌ ‌సిఐ శ్రీనివాస్‌ ‌సిబ్బందితో కలసి కేక్‌ ‌కట్‌ ‌చేసి అభినందనలు తెలుపు కున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ ఏసీపీ బాలాజీ మాట్లాడుతూ..పోలీస్‌ ‌కమిషనర్‌ ఆదేశానుసారం డ్రంక్‌ అం‌డ్‌ ‌డ్రైవ్‌ ‌పై తరచుగా స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌నిర్వహిస్తామని తెలిపినారు. వాహనదారుడు ట్రాఫిక్‌ ‌నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడిపి సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేరుకోవాలని సూచించారు. బహిరంగ మద్యపానం సేవించే వారిపై  కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ట్రాఫిక్‌ ‌సీఐ శ్రీనివాస్‌, ‌గజ్వేల్‌ ‌ట్రాఫిక్‌ ‌సీఐ నరసింహారావు పోలీస్‌ ‌సిబ్బంది పాల్గొన్నారు.

Tags: new year celebrations, traffic acp balaji

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply