Take a fresh look at your lifestyle.

ఒక్క రోజే కొరోనా నుండి కోలుకున్న వారు 705

  • దేశంలో కొరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 18601కు చేరిక
  • మొత్తం 3252 మంది డిశ్చార్జ్ : ‌లవ్‌ అగర్వాల్‌

కొరోనా వైరస్‌ ‌తీవ్రత భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు ర్యాపిడ్‌ ‌టెస్ట్ ‌కిట్ల ఫలితాలపై అయోమయం నెలకొంది వీటి ద్వారా ఫలితాల్లో తారుమారు కనిపిస్తోంది. దీంతో వెంటనే అప్రమత్తంఅ యిన కేంద్రం ఈమేరకు వాటి వాడకంపై రెండు రోజసులపాటు నిషేధం విధించింది. ఈ మేరకు ఆయా రాష్టాల్రకు ఐసిఎంఆర్‌ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో మంగళవారం మధ్యాహ్నం వరకు కొరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 18601కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ ‌తెలిపారు. సోమవారం ఒక్కరోజే 705 మంది కొరోనా బాధితులు కోలుకున్నారని ఇప్పటి వరకు మొత్తం 3252 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. దీంత దేశంలో కొరోనా నుంచి కోలుకున్న వారి శాతం 17.48కు పెరిగిందన్నారు. వచ్చే రెండు రోజుల పాటు ర్యాపిడ్‌ ‌టెస్టు కిట్లు వాడొద్దని ఐసీఎంఆర్‌ ‌సూచించింది. ర్యాపిడ్‌ ‌టెస్ట్ ‌కిట్ల పనితీరుపై విచారణ జరుపుతామని తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు 4,49,810 పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే 35,852 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేశామని వెల్లడించింది. ఐసీఎంఆర్‌ ‌నెట్‌వర్క్‌కు చెందిన 201 ల్యాబ్‌ల్లో 29,776 టెస్ట్‌లు చేయగా..86 ప్రైవేట్‌ ‌ల్యాబ్‌ల్లో 6,076 శాంపిల్స్ ‌పరీక్షించినట్లు తెలిపింది. ర్యాపిడ్‌ ‌టెస్ట్ ‌కిట్స్ ‌ఫలితాల్లో చాలా తేడాలు వస్తున్నాయి. వచ్చే రెండు రోజుల్లో కిట్లను పరీక్షించి..ఆరోగ్య మంత్రిత్వశాఖ ధ్రువీకరిస్తుంది. ర్యాపిడ్‌ ‌టెస్ట్ ‌కిట్ల వాడకంపై ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు ఇచ్చే వరకు రాష్టాల్రు వీటిని రెండురోజుల పాటు వాడొద్దు అని ఐసీఎంఆర్‌ ‌సూచించింది. కరోనా కేసులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4,49,810 నమూనాలను పరీక్షించామని ఇండియన్‌ ‌మెడికల్‌ ‌రిసెర్చ్ (ఐసీఎంఆర్‌) ‌ప్రకటించింది. అందులో ఆదివారం ఒక్కరోజే 35,852 పరీక్షలు నిర్వహించామని ఐసీఎంఆర్‌ అధికారి ఆర్‌ ‌గంగాఖేద్కర్‌ ‌చెప్పారు. వీటిని దేశవ్యాప్తంగా ఉన్న 201 ఐసీఎంఆర్‌ ‌సెంటర్లలో నిర్వహించా మని వెల్లడించారు. మిగిలిన 6076 నమూనాలను 86 ప్రైవేట్‌ ‌ల్యాబుల్లో పరీక్షించామని చెప్పారు. గత 14 రోజుల్లో 23 రాష్టాల్రు లేదా కేంద్ర పాలితప్రాంతాల్లోని 61 జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదుకాలేదని చెప్పారు. రెండు రోజులపాటు ర్యాపిడ్‌ ‌టెస్టింగ్‌ ‌కిట్లును ఉపయోగించకూడదని రాష్టాల్రకు సూచించారు.

- Advertisement -

సోమవారం ఒక్కరోజే 705 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రకటించారు. భారత్‌లో ఇప్పటికి 3,252 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ టెస్ట కిట్‌లతో సమస్యలు వస్తున్నాయన్న ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కోవిడ్‌-19 ‌కట్టడి చర్యల్లో భాగంగా రాష్టాల్రకు కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఆసుపత్రుల్లో ఇతర వైద్య సేవలు కూడా అందుబాటులో ఉండాలని, హెచ్‌ఐవీ, క్యాన్సర్‌ ‌వ్యాధులకు కూడా చికిత్స అందాలని.. అయితే అదే సందర్భంలో ఇన్‌ఫెక్షన్‌ ‌సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. కరోనాను నయం చేసే దిశగా 5 వ్యాక్సిన్స్‌లను 70 మందిపై ప్రయోగించినట్లు తెలిపింది. ఇప్పటివరకూ భారత్‌లో 4,49,810 కరోనా నిర్దారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎమ్‌ఆర్‌ ‌వెల్లడించింది. కరోనా వైరస్‌పై సత్వర ఫలితాల కోసం వినియోగించే ర్యాపిడ్‌ ‌టెస్ట్ ‌కిట్లు సరైన ఫలితాలు ఇవ్వడం లేదని అంటూ రాజస్థాన్‌ ‌వాటి ఉపయోగాన్ని నిలిపివేసింది. భారతదేశంలో పరీక్షలకు సంబంధించిన కేంద్ర సంస్థ అయిన భారత వైద్య పరిశోధన మండలి – ఐసీఎంఆర్‌కు ఈ సంగతి తెలియజేసింది. కేవలం 5.4 శాతం మాత్రమే సరైన ఫలితాలు వస్తున్నాయని రాష్ట్ర ఆరోగ్యమంత్రి రఘుశర్మ వెల్లడించారు. రాజస్థాన్‌లో జైపూర్‌ ‌సహా పలు హాట్‌స్పాట్లలో 170 ఫరీక్షలు జరుపగా తప్పుడు ఫలితాలు వచ్చాయని అన్నారు.

ఈసరికే కరోనా ఉన్నవారికి సైతం ఆ కిట్లు ఉపయోగించి పరీక్షిస్తే నెగెటివ్‌ ‌వచ్చిందని వివరించారు. దాంతో కిట్స్ ‌విశ్వసనీయతపై అనుమానాలు తలెత్తాయని, వైద్య కమిటీ సలహా మేరకు వాటిని ఉపయోగించడం నిలిపివేసి ఐసీఎంఆర్‌కు తెలియజేశామని మంత్రి చెప్పారు. కరోనా వైరస్‌ ‌హాట్‌స్పాట్లలో ర్యాపిడ్‌ ‌టెస్ట్ ‌కిట్స్ ఉపయోగించాలని ఐసీఎంఆర్‌ ‌సూచించింది. దీంతో భారత్‌ ‌సుమారు 5 లక్షల టెస్ట్ ‌కిట్స్‌ను చైనా నుంచి దిగుమతి చేసుకున్నది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జగన్‌ ‌సర్కారు ఇటీవలే దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్‌ ‌టెస్టింగ్‌ ‌కిట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కిట్ల ద్వారా హాట్‌ ‌స్పాట్‌లలో కోవిడ్‌ ‌కేసులను త్వరితగతిన గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్త మవుతోంది. ఈ క్రమంలో ఏపీ సహా పలు రాష్టాల్రకు కేంద్రం ఊహించని షాక్‌ ఇచ్చింది. కరోనా టెస్టింగ్‌ ‌విధానంపై కేంద్రం కీలక సూచనలు కేంద్రం..ర్యాపిడ్‌ ‌టెస్టింగ్‌ ‌కిట్లను ఉపయోగించవద్దని రాష్టాల్రకు సూచించింది. కరోనా ర్యాపిడ్‌ ‌టెస్టింగ్‌ ‌కిట్లను ఇప్పటికే రాష్టాల్రకు అందించామని వాటిని కూడా వెనక్కి తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ రెండు రోజుల్లో కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Leave a Reply