- వైరస్ కారణంగా 3,921 మంది మృతి
- కొరోనా తగ్గుముఖం..భారీగా తగ్గుతున్న కేసుల సంఖ్య
దేశంలో కొరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. 75 రోజుల తర్వాత పాజిటివ్ కేసులు 70 వేలకు దిగువకు వొచ్చాయి. కొత్తగా 24 గంటల్లో భారత్‌లో 70,421 కొరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 24 గంటల్లో 3,921 మంది కోవిడ్‌తో మృతి చెందారు. దీంతో మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,74,305కి చేరింది. ఇక 1,19,501 మంది కొరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు. ఇప్పటివరకు దేశంలో 2,81,62,947 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 9,73,158 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 14,92,152 మందికి కొరోనా పరీక్షలు నిర్వహించారు.
దీంతో దేశంలో మొత్తం పరీక్షల సంఖ్య 37,96,24,626కు చేరింది. ఇక ఇప్పటి వరకు 25.48 కోట్ల మందికిపైగా టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్ 1 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారయినా మరణాల సంఖ్య మాత్రం కాస్త ఎక్కువగానే ఉంది. క్రితం రోజుతో పోల్చితే మరణాల సంఖ్యలో పెరుగుదల నమోదైంది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది. పలు రాష్ట్రాలు మరణాల లెక్కను సవరిస్తుండటంతో మృతుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తున్నట్లు తెలుస్తున్నది.