వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

7‌న గురుకుల ప్రవేశపరీక్ష

April 5, 2019

తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ గురుకులాలలో 2019-20 విద్యాసంవత్సరం 5వ తరగతిలో ప్రవేశం పొందుటకు ఈనెల 7న ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నట్లు డీఈవో యాదయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, ‌పాలకుర్తిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. హాల్‌టికెట్‌లో సూచించిన పరీక్ష కేంద్రాల్లో అనుమతించడం జరుగుతుందన్నారు. పరీక్షకు వచ్చే సయమంలో విద్యార్థులు హాల్‌టికెట్లను వెంట తీసుకురావాలన్నారు. పరీక్ష సెంటర్‌లోకి సెల్‌ఫోన్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ ‌వస్తువులను తీసుకెల్లడం అనుమతించరన్నారు. విద్యార్థులు ఎవరు యూనిఫాంతో రావదన్నారు.