*పట్టణ మురికివాడల్లో 15.9 శాతం మంది బాధితులు
*8-45 సంవత్సరాల వయస్సు వారిలో అధికం
*సీరం సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ఐసీఎంఆర్ నిర్వహించిన మొట్టమొదటి జాతీయ సెరో సర్వేలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటన్నింటిని ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్లో ప్రచురించారు. భారతదేశంలోని గ్రామాలలో మొత్తం 69.4 శాతం మందికి కొరోనా వైరస్ సంక్రమించినట్లు ఆ సర్వేలో తెలిసినట్లు పేర్కొంది. ఈ సర్వేలో గ్రామీణ ప్రాంతాల్లో 69.4 శాతం మందికి, పట్టణ మురికివాడలలో 15.9 శాతం మందికి, మిగిలిన ప్రాంతాలలో 14.6 శాతం మందికి కొరోనా పాజిటివ్ వచ్చినట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 18-45 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో పాజిటివిటీ అత్యధికంగా 43.3 శాతం ఉంది. ఆ తరువాత 46-60 సంవత్సరాల వారిలో 39.5 శాతం ఉండగా 60 ఏళ్లు పైబడిన వారిలో అత్యల్పంగా కరోనా పాజిటివిటి ఉన్నట్లు తేలింది. దేశంలోని 21 రాష్ట్రాల్లో 70 జిల్లాల్లో 700 గ్రామాలు, వార్డుల్లో మే 11 నుంచి జూన్ 4 వరకు ఈ సర్వే జరిగింది. కోవిడ్ కవచ్ ఎలీసా కిట్
ఉపయోగించి 28,000 మంది రక్తనమునాలు సేకరించి ఐజీజీ యాంటీబాడీస్ కోసం పరీక్షించింది. సీరో సర్వే ప్రకారం.. మే, జూన్ నెలల్లో గ్రాగ్రామీణ ప్రాంతాలకు వైరస్ ప్రబలినట్లు గుర్తించారు. తొలుత పెద్ద నగరాల్లో కేసలు నమోదు అయినా.. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలకు కొరోనా వ్యాపించడం కొంత ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. యూపీ, బీహార్ లాంటి రాష్టాల్లో్ కేసులు ఇంకా బయటపడే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సీరో పాజిటివిటీ 69.4 శాతంగా, పట్టణ మురికివాడల్లో 15.9 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 14.6 శాతంగా ఉన్నట్లు గుర్తించారు. సీరో పాజిటివిటీ పరీక్ష ద్వారా రక్తంలో యాంటీబాడీలు ఉన్నాయో లేదో తెలుస్తుంది.