Take a fresh look at your lifestyle.

స్వస్థలాలకు వెళ్తాం,పాసులు ఇప్పించండి కార్మికుల ధర్నా

స్వస్థలాలకు వెళ్తాం పాసులు ,ఇప్పించమని బీటీపిఎస్‌ ‌నిర్మాణ కార్మికులు రెండున్నర గంటల పాటు గేటు ముందు ధర్నా నిర్వహించారు.సోమవారం సుమారు 30 ఏజెన్సీల నుంచి 3,000 మంది కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లడం కోసం మెరుపు సమ్మెకు దిగారు.లాక్‌డౌన్‌ ‌సడలింపులో భాగంగా వలస కూలీలు తమ ప్రాంతాలకు వెళ్లోచ్చని కేంద్రం అనుమతి ఇవ్వడంతో కార్మికులు తమ ఇండ్లకు చేరుకోవాలని ఆతురతతో ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా కార్మికులు మాట్లాడుతూ గత కొంతకాలంగా ఆయా కంపెనీలు జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని,కనీస అవసరాల కోసం అందుబాటులో నిత్యావసర సరుకులు లేవన్నారు. ప్రక్కన ఉన్న ఊర్లలోకి వెళ్తే ప్రజలు రానివ్వడం లేదని వాపోయారు. 3,000 మంది కార్మికులు ఉంటే కొన్ని స్వచ్చంద సంస్థలు కొంతమందికే ఆర్దిక సహాయం అందిస్తుందన్నారు.

లాక్‌డౌన్‌ ‌కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నామని, తమ స్వంత గ్రామాలకు వెళ్లేందుకు పాసులు ఇప్పించాలని ఆందోళనకు దిగారు. సంఘటనా స్థలానికి తహాసీల్దార్‌ ‌నారాయణ మూర్తి,ఎస్‌హెచ్‌ఓ ‌షుకురు చేరుకోని వాళ్లకు నచ్చజెప్పారు. ఏ ఏ రాష్ట్రంకు వెళ్లేవారు ఎంతమంది ఉన్నారో వివరాలు సేకరించారు.దానిని జిల్లా కలెక్టరు ,ఎస్పి దృస్టికి తీసుకెళ్తామని ,పాసులు,అనుమతులు రావడంతో స్వంత ఊర్లకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.మీకు రావాల్సిన వేతనాలు,ఇతర బకాయిలు అవన్ని సిఈ బాలరాజు ఆధ్వర్యంలో అందరికి అందేటట్లు చూస్తామని తెలిపారు.

Leave a Reply