Take a fresh look at your lifestyle.

తెలంగాణలో కొత్తగా 6,876 కొరోనా కేసులు

59 మంది మృతి
తెలంగాణలో కొత్తగా 6,876 కొరోనా కేసులు నమోదు అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా హెల్త్ ‌బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొరోనా కారణంగా 59 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 2,476కు చేరుకుంది. తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 4,63,361కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 79,520 యాక్టివ్‌ ‌కేసులుండగా.. 3,81,365 మంది కొరోనా నుంచి కోలుకున్నారు. కాగా.. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో 1,029, మేడ్చల్‌ 507, ‌నల్గొండ 402, రంగారెడ్డి 387 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ ‌పార్క్‌లో 8 ఆసియా సింహాలు కరోనా బారినపడడం కలకలం రేపుతోంది.

సింహాల్లో కొరోనా లక్షణాలు కనిపించడంతో గత నెల 24న నమూనాలు సేకరించిన జూ అధికారులు వాటిని పరీక్షల నిమిత్తం సీసీఎంబీకి పంపించారు. తాజాగా, పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఆ ఎనిమిది సింహాలకు కొరోనా వైరస్‌ ‌సంక్రమించినట్టు నిర్దారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సింహాలను ఐసోలేషన్‌లో ఉంచారు. అలాగే, వాటికి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. సింహాలు సాధారణంగానే ఉన్నాయని, బాగానే ఆహారం తీసుకుంటున్నాయని జూ అధికారులు తెలిపారు. అలాగే, ముందు జాగ్రత్త చర్యగా జూకు వచ్చే సందర్శకులను నిలిపివేశారు. జూను మూసేసారు.

Leave a Reply