Take a fresh look at your lifestyle.

పేద కుటుంబాలకు అండగా.. సామాన్య రైతు

మండలంలోని తిమ్మాపూర్‌ ‌గ్రామంలోని రైతు కుటుంబానికి చేందిన బోచ్చు చిన్నమల్లయ్య అనే ఓ సామాన్య రైతు గ్రామంలోని నిరూపేదలకు, వలస కూలీలకు నిత్యవసర సరుకులు అందిస్తూ అండగ నిలుస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. సోమవారం తిమ్మాపూర్‌ ‌గ్రామంలోని 80 మంది నిరూపేద కుటుంబాలకు, వలసకూలీలకు  రూ.25 వేల విలువ గల బియ్యం, పప్పు, నూనే, చక్కేర, సబ్బులు, ఇతర నిత్యవసర సరుకులను పంపిణి చేసారు.

ఈ సంధర్భంగా మాజీ ఎంపీపీ నేరేళ్ళ దేవేంధర్‌ ‌మాట్లడుతూ ఓక సామాన్య రైతు కరోనా సమయంలో పేదలను, వలస కూలీలను అదుకునేందుకు ముందుకు రావడం రూ.25వేల విలువ గల నిత్యవసర సరుకులను అందజేయడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మొండి కిరణ్‌, ఏనుగు పెద్ద ముత్యంరెడ్డి, యేలేటి రాజారెడ్డి, రాజేషుని నారాయణ, రాజేషుని రవీంధర్‌, ‌జగన్‌, ‌విఆర్‌ఏ ‌నర్సయ్య, వినోద్‌లు పాల్గోన్నారు.

Leave a Reply