Take a fresh look at your lifestyle.

ఇం‌కెంతకాలం రైతుల పడిగాపులు?

  • ధాన్యం కొనుగోలులో ఆలస్యమెందుకో..?
  • గోనెసంచులు సరిపడు రాక ఇబ్బందులు
  • రోజుకు ఒకటి రెండు లారీలు మాత్రమే
  • మిల్లులకు తరలింపు
  • ఆకాల వర్షం వస్తే పరిస్థితేంది?

రైతులు కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు ఐకేపి కేంద్రానికి తీసుకొస్తే అధికారులు కొనుగోలు చేయడంలో ఆలస్యం అవుతుంది. 20రోజుల నుండి ధాన్యాన్ని అమ్ముకుందామని ఐకేలపి వచ్చిన రైతులకు నిరాశే మిగిలింది. ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు ఎండలో నిరీక్షిస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తు న్నారు. ఆయా మండలాల ఐక్షేపి కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని అమ్ముకు నేందుకు వచ్చే రైతులు నానా అవస్థలు పడుతున్నారు. 20రోజుల కింద ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఐకేచపికి రైతులు తమ ధాన్యాన్ని అమ్మడానికి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నా రైతులకు నిరాశే మిగులుతుంది.
కొనుగోలు కేంద్రాలకు గోనెసంచులు సరిపడు రాకపోవ డంతో ధాన్యం కొనుగోలు చేయడంలో ఆలస్యం ఏర్పడుతుంది. దీంతో రోజుకు ఒకటి, రెండు లారీలు మాత్రమే మిల్లులకు తరలిస్తున్నారు. దీనికి తోడు ఆకలవర్షాలు పడే పరిస్థితులు ఉండటంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. రామన్నపేట మండలంలో 11 ఐకే•పి కేంద్రాలల్లో ఇప్పటివరకు దాదాపు 1650 రైతులు తమ ధాన్యాన్ని కేంద్రాలల్లో పోసి ఆరబెట్టుకుంటున్నారు. ఇప్పటివరకు 850మంది రైతుల ధాన్యం 257485 బ్యాగులు కొనుగోలు చేశారు. పోచంపల్లిలో : మండలంలో మొత్తం 14 ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి.

ఇప్పటివరకు 885 మంది రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యం విక్రహించిన రాయితీలు బ్యాంకులో డబ్బులు జమవుతున్నాయి. ధాన్యం కొనుగోలును వేగవంతం చేసేందుకు అధికంగా కాంటాలు చేయాలని రైతులు కోరుతున్నారు. వలిగొండ : 20 ఐకేపి కేంద్రాలు ఉండగా అందులో 440మంది రైతుల ధాన్యం నిల్వ ఉన్నది.

Leave a Reply