Take a fresh look at your lifestyle.

ఏపీలో కొత్తగా 68 కొరోనా పాజిటివ్‌

  • తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు మృతి
  • 14 మంది తెనాలి క్వారంటైన్‌కు తరలింపు

అమరావతి,మే 27 : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ ‌పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 68 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు. కొత్తగా నమోదైన వాటిలో 9 కేసులు కోయంబేడుతో సంబంధం ఉన్న కేసులు. ఏపీలో ఇప్పటి వరకు 2,787 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా,58 మంది ప్రాణాలు కోల్పో యారు. యాక్టివ్‌ ‌కేసులు 816 కాగా, 1913 మంది ఈ వైరస్‌ ‌నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యా రు. గుంటూరు జిల్లా కర్లపాలెం మండల పరిధిలోని ఓ మహిళతో పాటు ఇద్దరు చిన్నారులకు కరోనా పాజిటివ్‌ ‌రావడంతో వీరితో సన్నిహితంగా ఉన్న మరో 14 మందిని అధికారులు తెనాలి క్వారంటైన్‌ ‌కేంద్రానికి తరలించారు. గతంలో శ్రీరామ్‌నగర్‌ ‌గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా వ్యాధి సోకడంతో విజయవాడ క్వారంటైన్‌ ‌కేంద్రంలో ఉండి వ్యాధి నయమైన తరువాత ఇటీవల తిరిగి తన ఇంటికి వచ్చాడు. మరళా తల్లి ఇద్దరు పిల్లలకు కరోనా పాజిటివ్‌ ‌రావడంతో కర్లపాలెం మండలంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కర్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఎస్‌కె సుహానా బేగం తెలిపిన వివరాల మేరకు.. బుద్దాం గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త మద్రాసులో సాప్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తుండడంతో అక్కడే అతనితో కలసి ఉంటుంది. ఆమె భర్తకు కరోనా వ్యాధి సోకడంతో అతనిని స్థానిక అధికారులు క్వారంటైన్‌కు పంపి వైద్య సేవలందిస్తున్నారు.

ఈనేపథ్యంలో సదరు మహిళ తన ఇద్దరు పిల్లలతో కలసి ఈనెల 22న నెల్లూరు వరకు ఒక వాహనంలో అక్కడి నుంచి తమ బంధువుల కారులో గుంటూరు జిల్లా బాపట్లలో ఉన్న తమ బంధువుల ఇంటికి వచ్చింది. ఆమెకు ఆరోగ్యం బాగుండ కపోవడంతో తన ఇద్దరు పిల్లలతో కలసి ఈనెల 23న చీరాల ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోగా ముగ్గురికీ కరోనా పాజిటివ్‌ అని రిపోర్ట్ ‌రావడంతో అక్కడి అధికారులు వారిని ఒంగోలు లోని క్వారంటైన్‌ ‌కేంద్రానికి తరలించి ఆమెతో పాటు ఉన్న తల్లిని చీరాల క్వారంటైన్‌ ‌కేంద్రంలో ఉంచారు. మహిళతో సన్నిహితంగా ఉన్న బుద్దాం, పెదగొల్లపాలెం గ్రామాలకు చెందిన తన అన్నదమ్ముల కుటుంబ సభ్యులను, నెల్లూరు నుంచి బాపట్ల తీసుకొచ్చిన కారు డ్రైవర్‌తో సహా మొత్తం 14 మందిని తెనాలి క్వారంటైన్‌ ‌కేంద్రానికి తరలించినట్లు డాక్టర్‌ ‌తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!