Take a fresh look at your lifestyle.

అవసరమైన జాగ్రతలతో ఇసుక కేటాయింపులు చేయాలి

మూడు నూతన ఇసుక రీచ్‌ల నుంచి సరఫరా -అప్రోచ్‌ ‌రోడ్డు, ర్యాంపుల నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి : కలెక్టర్‌ ‌సిక్తా పట్నాయక్‌  

అవసర మైన జాగ్రత్తలు పాటిస్తూ ఇసుక రీచ్‌ ‌కేటాయింపుల చేయాలని జిల్లా కలెక్టర్‌ ‌సిక్తా పట్నాయక్‌ ‌సంబంధిత అధికారులను ఆదేశించారు. నూతన ఇసుక రీచ్‌ల కేటాయింపు, ఇస్సుక పాలసీ సంబంధిత అంశాలపై సోమవారం కలెక్టర్‌ ‌సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌ ‌లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి ఇసుక సమీక్ష సమావేశం నిర్వహించారు. కాళేశ్వర ప్రాజెక్టు ఎత్తిపోత ల పథకంలో భాగంగా మల్లన్నసాగర్‌ ‌రిజర్వాయర్‌ ‌నిర్మాణానికి 22.39లక్షల క్యూబిక్‌ ‌మీటర్ల ఇసుక అవసరం ఉందన్నారు. జిల్లాలోని ఇసుక రీచ్ల నుండి కనీసం 8లక్షల క్యూబిక్‌ ‌మీటర్ల ఇసుక కేటాయించాలని కోరినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశా ల మేరకు మంథని మండలం వెంకటాపూర్‌ ‌గ్రామం అన్నారం బ్యారేజికి 9.5కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని అదనపు కలెక్టర్‌ ‌నేతృత్వంలో సబ్‌ ‌కమిటీ పరిశీలించి 3 మీటర్ల లోతులో 8,41,800క్యూబిక్‌ ‌మీటర్ల ఇసుక గుర్తించినట్లు తెలిపారు. దీనినే మల్లన్న సాగర్‌ ‌ప్రాజెక్టు నిర్మాణానికి సరఫరా చేసేందుకు చర్య లు తీసుకొవాలన్నారు. ఇసుక తవ్వకాల కొరకు కాళేశ్వ రం ప్రాజెక్టు ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి, రాష్ట్ర ఖనిజా భివృద్ధి సంస్థతో ఒప్పందం చేసుకోవాలని కలెక్టర్‌ ‌సూచించారు. ఇసుక సరఫరా సమయంలో బిటి రోడ్లు, మట్టి రోడ్డులను కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ నిర్వహించాలన్నారు.

వెంకటాపురం గ్రామం నుంచి పెద్దపల్లి, కాటారం మొదలగు బీటీ రోడ్లను సొంత ఖర్చులతో సంరక్షించాలని కలెక్టర్‌ ‌కోరారు. ఇసుక సరఫరాకు అవసరమైన అప్ప్రోచ్‌ ‌రోడ్డు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి నేపథ్యంలో ఇసుక రీచ్ల వద్ద భౌతిక దూరం పాటించి, మాస్కులు ధరించాలన్నారు. చేతులను శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు. గతంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఓదెల మండలంలోని కనగర్తి గ్రామంలో 6000క్యూబిక్‌ ‌మీటర్ల ఇసుక, శ్రీరాంపూర్‌ ‌మండలంలోని మట్టెపల్లి గ్రామాలలో 8930క్యూబిక్‌ ‌మీటర్ల, ముత్తారం మండలం ఓడెడు గ్రామంలోని 16,500 క్యుబిక్‌ ‌మీటర్ల మేర ఇస్సుక రీచ్‌లను మరో సారి పరిశీలించి, స్థానిక అవసరాలకు సరిపడా ఇసుక సరఫరా కొరకు వీటిని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థకు ఇసుక సరఫరా నిమిత్తం అందించాలన్నారు. నిబంధనల ప్రకారం ప్రతిపాదనలు సిద్దం చేసి ఇసుక సరఫరా పారదర్శకంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఇసుక రీచ్‌లకు అవసరమైన అప్రోచ్‌ ‌రొడ్లు, ర్యాంపులను నిర్మించడానికి అవసరమైన ప్రతిపాదలు సిద్దం చేయాలన్నారు. ఈ సమావేశంలో అడిషినల్‌ ‌కలెక్టర్‌ ‌లక్ష్మీనారాయణ, ఇంఛార్జీ డిఆర్వో నరసింహమూర్తి, ఆర్‌డిఓ శంకర్‌ ‌కుమార్‌, ఎడి మైన్స్ ‌సాయినాథ్‌, ‌డిపిఓ వేముల సుదర్శన్‌, ‌మండల తహశీల్దార్లు, ఎంపిడిఓలు, జిల్లా అధికారులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

error: Content is protected !!