Take a fresh look at your lifestyle.

పోలీస్‌ ‌శాఖకు రూ. 6,465 కోట్లు కేటాయింపు

శాంతి భద్రతలు, పోలీసు శాఖ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది. తెలంగాణ పోలీసులు భేషుగ్గా పనిచేస్తున్నారని సిఎం కెసిఆర్‌ అసెంబ్లీలో కూడా చెప్పారు. తాజాగా బడ్జెట్‌ ‌లో హోంశాఖకు రూ. 6,465 కోట్లు కేటాయించినట్లు శాసనసభలో ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు, ఫ్రెండ్లీ పోలీసు విధానం అమలయ్యే విధంగా చర్యలు చేపట్టిందన్నారు. పోలీసు శాఖకు భారీగా నిధులు కేటాయించి, నూతన వాహనాలను, సాంకేతిక సాధనాలను సమకూర్చిందని తెలిపారు.

- Advertisement -

గుడుంబా, పేకాట, గ్యాంబ్లింగ్‌ల నిషేధాన్ని అమలు చేస్తున్నారు. కరోనా కాలంలోనూ పోలీసుశాఖ స్ఫూర్తిదాయకమైన సేవలను అందించింది. అందుకు వారికి అదనంగా ఒక నెల వేతనాన్ని ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు. బహిరంగ ప్రదేశాల పర్యవేక్షణ కోసం నగర వ్యాప్తంగా 6 లక్షల 65 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసిందన్నారు. దేశంలో ఉన్న మొత్తం సీసీ కెమెరాల్లో 65 శాతం తెలంగాణలో ఉన్నాయని మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు.

Leave a Reply