Take a fresh look at your lifestyle.

2018లో దేశంలో రోజూ 63 మంది.. గృహిణుల ఆత్మహత్యలు ఎందుకు?

“2018‌లో మొత్తం 1,34,516 మంది మహిళలు ఇలాంటి యత్నాలకు ఒడిగట్టగా, వారిలో చాలా తక్కువ మంది బతికారని జాతీయ నేర గణాంక సంస్థ పేర్కొంది. భారత్‌లో ఆత్మహత్యలు చేసుకునే వారిలో ఎక్కువ మంది గృహిణులే. రోజుకూ 63 మంది గృహిణులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు గణాంకాలు అబుతున్నాయి. 2001 నుంచి 20వేల మంది గృహిణులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరి శాతం 17.1 కాగా, దినసరి వేతనంపై పని చేసే వారి శాతం ఇంకా ఎక్కువ ఉంది. ఆకలి బాధ, దారిద్య్రం మొదలైన కారణాలతో అసంఘటిత రంగంలో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.”

63 people in the country on a regular basis in 2018

- Advertisement -

36ఏళ్ళ శివానీ అనే గృహిణికి 16 ఏళ్ళ క్రితం పెళ్ళి అయింది. చాలా చిన్న వయసులో. ఆమెను భర్త,అత్త వారింట్లో వారు ఇంటికే పరిమితం చేయడంతో ఆమెలో నైరాశ్యం చోటు చేసు కుంది. హర్యానాలోని రోహటక్‌కు చెందిన ఆమె తాను లావుగా ఉన్నాననీ, తరచూ రోగాలతో మంచమెక్కుతానని తన భర్త అవమాని స్తాడని చెప్పింది.2017 ఆగస్టులో శివానీ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. ఆమె స్పృహ తప్పి పడిపో వడాన్ని శివానీ అత్తగారు చూసి ఆమె సోదరునికి కబురు చేసింది.ఆమెను వెంటనే వారు ఆస్పత్రికి చేర్చారు. ఇంటెన్సివ్‌కేర్‌ ‌యూనిట్‌లో ఆమె చికిత్సకు ఏర్పాటు చేశారు. ఆస్పత్రి వర్గాలు పోలీసులను పిలిచారు. శివానీ, ఆమె కుటుంబ సభ్యులు ఆమె ఆత్మహత్యాయత్నానికి భర్త ఏమాత్రం బాధ్యుడు కాడనీ, ఇది పూర్తిగా ఆమె స్వంత నిర్ణయమని వారు పోలీసులతో చెప్పారు. ఇలాంటి సంఘటనల్లో పోలీసు కేసులు చాలా అరుదుగా నమోదు అవుతూ ఉంటాయి. దేశంలో ఇలాంటి శివానీలు 2,075 మంది ఉన్నారు. వారిలో ఆమె ఒకరు. వారంతా స్వంతంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని ప్రకటిస్తూ ఉంటారు. 2018లో మొత్తం 1,34,516 మంది మహిళలు ఇలాంటి యత్నాలకు ఒడిగట్టగా, వారిలో చాలా తక్కువ మంది బతికారని జాతీయ నేర గణాంక సంస్థ పేర్కొంది. భారత్‌లో ఆత్మహత్యలు చేసుకునే వారిలో ఎక్కువ మంది గృహిణులే. రోజుకూ 63 మంది గృహిణులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు గణాంకాలు అబుతున్నాయి. 2001 నుంచి 20వేల మంది గృహిణులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరి శాతం 17.1 కాగా, దినసరి వేతనంపై పని చేసే వారి శాతం ఇంకా ఎక్కువ ఉంది. ఆకలి బాధ, దారిద్య్రం మొదలైన కారణాలతో అసంఘటిత రంగంలో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2016లో 36 శాతం మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకోగా, వారిలో మూడో వంతు మంది దారిద్య్రం, నిరాశా నిస్పృహలకు ఈ దారుణానికి ఒడిగట్టారని తేలింది. ఆత్మహత్యలు చేసుకునే మహిళల్లో వివాహితలు ఎక్కువ మంది ఉన్నారు.

కన్యలుగా గర్భం దాల్చడం, దారిద్య్రం, గృహహింస మొదలైన కారణాల వల్ల వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు తేలిందని సామాజిక శాస్త్రవేత్త దీపా నారాయణన్‌ ‌తెలిపారు. ఆమె ఛుప్‌ అనే పుస్తకాన్ని రాశారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలకు ధైర్యం చెప్పేవారు కానీ, చేయూతనిచ్చేవారు కానీ లేరని ఆమె అన్నారు. 2018లో ఆత్మహత్యలు చేసుకున్న మహిళల సంఖ్య 22,937కి పెరిగింది. 2017లో వారి సంఖ్య 21,453 మాత్రమే. వీటిలో పోలీసు కేసులు నమోదైనవి చాలా తక్కువ. ఆత్మహత్యలు చేసుకునే వివాహితల కేసుల్లో సగానికిపైగా మరణాలకు వరకట్న హింసలే కారణం. స్నానాల గదిలో ప్రమాదవశాత్తు మరణించారనీ, వంట చేసేటప్పుడు నిప్పు అంటుకుందని అసత్యాలు చెబుతూ ఉంటారని దీపా నారాయణన్‌ అన్నారు. మహిళల్లో ముఖ్యంగా పెళ్ళి అయిన యువతుల్లో నిరాశానిస్పృహలు పెరగడానికి అతింటి వారు పెట్టే ఆరళ్ళు కారణమని ఆమె అన్నారు. ఆక్సఫామ్‌ ఇం‌డియా సర్వేలో కూడా పెళ్ళయిన యువతుల మరణాలకు గృహ హింసే కారణ మని తేలింది.ఉత్తరప్రదేశ్‌, ‌బీహార్‌, ‌తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువ.మానసిక స్థతి సరిగా లేకపోవడం వల్ల కూడా పెళ్ళయిన మహిళలు ఆత్మహత్య లకు పాల్పడుతుంటారని బెంగళూరులోని మైండ్‌ ‌రిసెర్చ్ ‌ఫౌండేషన్‌కు చెందిన శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. లింగ వివక్షత,అవమానాలు కూడా ఇలాంటి దుర్మ రణాలకు కారణమని కార్నిక్‌సేథ్‌ ‌పేర్కొన్నారు.ఆయన న్యాయవాది, ఢిల్లీలోని ఫౌండేషన్‌ ‌ఫర్‌ ఇనిస్టిట్యూషనల్‌ ‌రిపార్మ్ అం‌డ్‌ ఎడ్యుకేషన్‌ ‌వ్యవస్థాపకుడు. నిరాశా నిస్పృహలకు లోనైన మహిళలకు జాతీయమహిళా కమిషన్‌ ‌కౌన్సెలింగ్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని దీపా నారాయణన్‌ ‌చెప్పారు. మహిళల్లో నిరాశను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టినట్టు నాంగ్‌ ‌తన్విమాన్‌ ‌పూంగ్‌ ‌తెలిపారు. జాతీయ మహిళా కమిషన్‌కు మీడియా సలహాదారుగా ఉన్నారు. మహిళల్లో విద్యావ్యాప్తి ద్వారానే నిరాశా నిస్పృహలను తొలగించడం సాధ్యమని మైండ్‌ ‌రిసెర్చ్ ‌ఫౌండేషన్‌ ‌సహ వ్యవస్థాకుకులు విశ్వకీర్తి భాన్‌ ‌ఛాబ్రా అన్నారు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన శివానీ కౌన్సెలింగ్‌ ‌ద్వారా తిరిగి కోలుకుంది. ప్రస్తుతం ఆమె దుస్తుల వ్యాపారం చేస్తోంది. తన భర్తకు విడాకులిచ్చింది. మహిళలు స్వశక్తిపై ఆధారపడితే ఇలాంటి పరిస్థితులు తలెత్తవని ఆమె అన్నారు. తన జీవితం పూర్తిగా మారిపోయిందని ఆమె అన్నారు. తాను తిరిగి కోలుకోవ డానికి తన సోదరుని సహకారం మరువలేనిదని ఆమె అన్నారు. జీవితం విలువైందనీ, క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోకూడదని ఆమె ఇప్పుడంటున్నారు. ఎంత మార్పు.
-స్క్రోల్‌.ఇన్‌ ‌సౌజన్యంతో

Leave a Reply