Take a fresh look at your lifestyle.

కొరోనాతో ఎపిలో ఒక్కరోజే 62మంది మృతి

  • రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 4944 కేసులు నమోదు
  • పరిస్థితిపై అధికారులతో సక్షించిన గవర్నర్‌

అమరావతి,జూలై 21 : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తుంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 62 మంది కరోనాతో మృత్యువాత పడ్డారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులిటిన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 4944 కేసులు నమోదు కాగా ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 58,668కు చేరుకుంది.ఒక్కరోజే రికార్డు సంఖ్యలో 62మంది చనిపోవడం కలవర పాటుకు గురిచేస్తుంది. తూర్పు గోదావరిలో 10 మంది,విశాఖపట్నంలో 9 మంది,చిత్తూరు 8 మంది, శ్రీకాకుళంలో 7 చనిపోయారు. అనంతపురం, పశ్చిమగోదావరిలో 6గురు చొప్పున, గుంటూరు, ప్రకాశంలో 5గురు చొప్పున,కర్నూలులో4, కడప విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున కరోనాకు బలయ్యారు.ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 758మంది కరోనాతో చనిపోయారని వైద్యులు తెలిపారు.ఇదిలావుంటే గవర్నర్‌ ‌బిశ్వభూషణ్‌ ‌మంగళవారం రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఉన్నతాధికారులతో సక్ష నిర్వహించారు.

వీడియోకాన్ఫరెన్సు ద్వారా నిర్వహించిన సక్షలో సీఎస్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.లాక్‌డౌన్‌కు ముందు,అనంతరం పరిస్థి తులను అడిగి తెలుసుకున్నారు.అన్‌లాక్‌ ‌కాలంలో 12 నుంచి13శాతం కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు.ఐదు జిల్లాలో ఎక్కువ నమోదు కావడంపై కారణాలను తెలుసుకున్నారు. పొరుగు రాష్టాల్ర నుంచి వస్తున్న వారిలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని అధికారులు గవర్నర్‌కు వివరించారు.జులై చివరినాటికి కేసులు తగ్గుముఖం పట్టే అవకాశముందని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులను ఈ సందర్బంగా గవర్నర్‌ అభినంది ంచారు.కరోనా బాధితుల కోసం ఆస్పత్రుల వారిగా వివరాలు ఇవ్వాలని, పడకల సంఖ్యను,వివరాలను ఆన్‌లైన్లో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply