Take a fresh look at your lifestyle.

ఎపిలో కొత్తగా 605 కేసులు నమోదు మొత్తం 10 మంది మృతి

అమరావతి,జూన్‌ 26 : ఏపీ కరోనా కేసుల తాజా బులెటిన్‌ను రాష్ట్ర  వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసింది. గత 24 గంటల్లో 605 కేసులు నమోదు అయ్యాయి. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 570 మంది కాగా,ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 34 మంది,విదేశాలకు చెందిన వారు ఒకరు ఉన్నారు.

మొత్తం 10 మంది చనిపోగా..కర్నూల్‌ ‌జిల్లాకు చెందిన వారు నలుగురు,కృష్ణా జిల్లాకు చెందిన వారు నలుగురు, గుంటూరులో ఒకరు,విశాఖలో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,489 కేసులు నమోదు కాగా, 6147 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, 5196 మంది డిశ్చార్జ్ అయ్యారని రికార్డులు చెబుతున్నాయి. 146 మంది చనిపోయారు.

Leave a Reply