పీఆర్సీ , బిశ్వాల్ నివేదిక పైనల్ కాదు ..
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పీఆర్సీపై నిర్ణయం తీసుకునేందుకు 2018 మే 28న సీఆర్ బిశ్వాల్ చైర్మన్‌గా మహ్మద్ ఆలీ రఫత్, ఉమా మహేశ్వరావులతో కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి విధితమే. కమిషన్ గడువును ప్రభుత్వం మూడు సార్లు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగు లకుచెందిన సాధారణ, ప్రత్యేక, తాత్కా లిక సర్వీస్ రూల్స్‌ను వెంటనే అందించాలని కోరుతూ అన్ని శాఖల అధిపతులకు నోట్‌ను పంపింది.ఈ కమిటీ తాజాగా వివిధ కేటగరీల్లోని అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగుల స్థితిగతులను పరిశీలించింది. వారికి చెందిన జీతభత్యాలు, అందుకుంటున్న ఇతర ప్రతిఫలం గురించి అధ్యయనం చేసింది. పీఆర్సీ పరిధిలోకి వచ్చే స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సంస్థలు, యూనివర్సిటీలలోని నాన్‌టీచింగ్ స్టాఫ్, వర్క్చార్జ్డ్ ఎంప్లాయీస్, ఫుల్‌టైం కాంటింజెంట్ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం ఎంతమేర సౌలభ్యంగా ఉంటుందో అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేసేందుకు ముమ్మరంగా కృషి చేసింది. సీఎం ఆదేశాల మేరకు ఎట్టకేలకు 31 నెలల తర్వాత 2020 డిసెంబర్ 31న సీఎస్ సోమేశ్ కుమార్‌కు అందచేసింది. ఈ రిపోర్ట్ కాపీని మొదట ఉద్యోగ సంఘాలకు అందజేసి, వాళ్లు స్టడీ చేసేందుకు కొంత గడువు ఇవ్వాలనుకున్నారు కాని పిఆర్సీ నివేదిక లీక్ కావడంతో ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాలకు మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఏట్టకేలకు ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిటీ పీఆర్సీ నివేదికను విడుదల చేసింది.
బిశ్వాల్ నివేదిక పైనల్ కాదు….
2019లో ఇక్కడి విద్యుత్తు ఉద్యోగులకు ప్రకటించిన ఫిట్మెంట్, ఆర్టీసీ ఉద్యోగులకిచ్చిన ఐఆర్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే తమకు 30 శాతం కంటే ఎక్కువ ఫిట్మెంట్ వస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు విశ్లేషిస్తున్నారు. నిజానికి గత పీఆర్సీ కంటే ఎక్కువ మొత్తంలోనే ఫిట్‌మెంట్‌ను ఉద్యోగులు ఆశించారు.పీఆర్సీ నివేదికలో పొందుపరిచిన సిఫారసుల ప్రకారం… ఈసారి ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు 7.5 శాతం ఫిట్మెంట్ పెంపును ప్రతిపాదించారు. కనీస వేతనం రూ.19వేలు,గరిష్ఠ వేతనం రూ.1,62,700గా ఉండాలని సూచించింది. సీపీఎస్ విధానంలో ప్రభుత్వ వాటాను 10 శాతం నుంచి 14శాతం పెంపుకు ప్రతిపాదించింది. హెచ్ఆర్ఏని 30శాతం నుంచి 24శాతానికి తగ్గిస్తూ ప్రతిపాదించడం గమనార్హం. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్ల పెంపుకు ప్రతిపాదించింది.ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవును 3 నెలల నుంచి 4 నెలలకు పెంచాలని కమిటీ ప్రతిపాదించింది. హెచ్ఆర్ఏ స్లాబులను హెచ్ఆర్ఏని 30శాతం నుంచి 11,13,17,24 గా కుదించడాన్ని తప్పు పడుతున్నారు. ఏవరు అడుగని , ఎవరికి అవసరం లేని ఉద్యోగ పదవి విరమణ వయస్సును సి.యం కేసీఆర్ చెప్పినట్లుగానే.. రెండేళ్ల పెంపుదలకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనితో తెలంగాణ వేతన సవరణ కార్యాచరణ చివరి దశకు చేరుకుంది.
ప్రగతిభవన్ తలుపులు మూసుకుపోలేదు….
తెలంగాణ రాష్ట్రంలో ఐఆర్ ఇవ్వక పోగా ఫిట్మెంట్ ను కేవలం 7.5% సిఫారసు చేయటం దారుణం. ఏ ప్రాతిపదికన నిర్ణయించారో అంతు చిక్కటం లేదు. జీవన వ్యయ ప్రమాణాలు, సమాజంలో ఉపాధ్యాయ, ఉద్యోగులు గౌరవ ప్రదంగా జీవించటానికి అవసరమైన విధంగా ఐదు సంవత్సరాలకు ఒకమారు వేతనాలను సవరించటం ఆనవాయితీగా వస్తోంది. పిఆర్సీ రిపోర్టు లో నిర్ణయించిన కనీస వేతనం 19000 ను పరిగణనలోకి తీసుకున్నా ఫిట్మెంట్ నిర్ణయంలో వైరుధ్యం కనిపిస్తోంది. ఫిట్మెంట్ 7.5%, పే స్కేల్స్ 10%, కనీస వేతనం 16% వెయిటేజితో రూపొందించినట్లు కనిపిస్తుంది. అదేవిధంగా టిఎస్ యుటిఎఫ్ సమర్పించిన ప్రతిపాదనలను కూడా రిపోర్టులో తప్పుగా పేర్కొన్నారు. ఇంటి అద్దె భత్యాన్ని తగ్గించారు. నగదురహిత వైద్యం కోసం నెలవారీ మూలవేతనంలో 1% కోత విధించటం, గ్రాట్యుటీ పరిమితి ఇరవై లక్షలు చేయాల్సి ఉండగా పదహారు లక్షలకే పరిమితం చేయటం, డ్యూటీ అలవెన్సులను నామ మాత్రం గా పెంచటం, ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన రూరల్ ఏరియా అలవెన్స్ ప్రస్తావనే లేకపోగా హెచ్చార్యే లోనే కోత విధించటం అన్యాయమని, పిఆర్సీ నివేదిక ఈరూపంలో వెలువడటం ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా అభాసుపాలు చేస్తున్నది. వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని పిఆర్సీ నివేదికను తిరస్కరించి, సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్ ప్రకటించటంతో పాటు, గ్రాట్యుటీని 20 లక్షలకు పెం చాలనే ఆలోచనతో ఉద్యోగ సంఘాల నాయకులు సీఎం దగ్గర మోర పెట్టుకునేందుకు మాకు తలుపులు మూసుకుపోలేదు. తెగేదాక లాగం. లౌక్యం పనిచేయ నప్పుడు ఏమి చేయాలో నిర్ణయిస్తాం’ ముఖ్యమంత్రి ఉద్యోగుల పక్షాన ఉంటారన్న నమ్మకం ఉంది. ఉద్యోగుల్లో అపోహలు వద్దు.. మంచి పీఆర్సీ సాధిస్తాం. పీఆర్సీ నివేదిక అశాస్త్రీయంగా తయారు చేశారు. నిర్ణయం తీసుకోవడంలో కొంత జాప్య జరిగినా ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ,
మానవతావాది కేసీఆర్…
తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా అది పీఆర్సీ అమలులో కనిపించడం లేదని, ఏవరికి వారే, గుస,గుస లాడటం కన్పించింది. దాని వ్యతిరేకతను పసిగట్టి కోత్త సంవత్సరం లో కేసీఆర్ పిఆర్సీ పై స్పందించడం, పూర్తి చేయాలని ఆదేశించండం, సీల్డ్కవర్లో ఉన్న ఆ నివేదికను చూసే సరికి మాత్రం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు గోంతులో వెలక్కాయ పడ్డట్టు అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిటీ పీఆర్సీ నివేదికను మాత్రమే ఇచ్చింది, చేయాల్సిందంతా కేసీఅర్ ప్రభుత్వమే … గతంలో విద్యుత్త్ శాఖ చేసిన ఆందోళన , పడ్డ హైరానా అంతాఇంతాకాదు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు 32 శాతం పీఆర్సీ వస్తుందని ఊహిస్తే.. వారికి 35 శాతం పీఆర్సీ ప్రకటించి.. వారిని మరింత ఉత్సాహంలో నింపేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. అదే విదంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 52 రోజులు నిరవధికంగా 26 డిమాండ్స్ తో సమ్మేచేస్తే చూపని పరిష్కారం …మానవతావాది కేసీఆర్ ఎవరు ఊహించని విధంగా అన్ని డిమాండ్లు పరిష్కరించి కార్మికుల గుండేల్లో దేవుడైన సంగతి తెలుసినదే…ఉద్యోగ సంఘ నాయకులు వేచిచూచే దోరణితో ,నిరాశ, నిస్పృహలతో ఉండడం, ఇదే అదనుగా ఉద్యోగులను మంచిగా చేసుకునేందుకు విపక్షాలు చేస్తున్న రాదాంతం అంతా, ఇంతాకాదు. అయితే గతానుభవాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ఆమోదయోగ్యంగా ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తారని ఉద్యోగులు ఆకాంక్షిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఎవరు అడిగినారనీ పదవి విరమణ వయస్సు పెంపు….
2018 ఎన్నికల మేనిఫెస్టో లో నిరుద్యోగభృతి, పదవివిరమణ వయస్సు పెంపు ప్రామాణికంగా చూసుకున్నట్లయితే కాంగ్రేస్ పార్టీ నాలుగు ఓట్లు సంపాదించుకోవాలనే ప్రయత్నంలో పదవి విరమణ వయస్సు 60 సంవత్సరాలు మేనీఫేస్టోలో పెట్టింది. ఒక అడుగు ముందుకేసి తెలంగాణ రాష్ట్ర సమితి 61 ఇస్తామని చెప్పింది .నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన సందర్భంలో ఇప్పటి వరకు నోచుకోలేదు. బిశ్వాల్ కమీటీ ఇచ్చిన 7.5 పీఆర్సీ, 58 నుండి 60 చేయాలనే నివేదికతో ప్రభుత్వంకు చెడ్డపేరు వస్తుందనేది నిర్వివాదం. గత కమీషన్ లు ఇచ్చిన అనేక సిపారసులను ఏ ప్రభుత్వం అమలు చేయలేదు.గత ఐదు పీఆర్సీ కమీటి నివేదికలు చూసినట్లయితే 1998 లో ఆర్కే ఆర్ గొనెల కమీషన్ ఫిట్మెంట్ సిఫారసు 20 కి చేయగా ప్రభుత్వం 25 ఇచ్చింది. 2004 లో జె. రాంబాబు కమీషన్ 10 శాతం ఫిట్మెంట్ సిఫ్హర్సు చేయగా 16శాతం ప్రభుత్వం అమలు చేసింది. 2008 లో సిఎస్ రావు కమీషన్ 27 ప్రపోజల్ చేయగా 39 ఆమోదం తెల్పింది. తదుపరి వచ్చిన ప్రదీప్ కుమార్ అగర్వాల్ కమీషన్ 29 సిఫారసు చేయగా తెలంగాణ ప్రభుత్వం 43 ఇచ్చింది. ఇప్పుడు సీఆర్ బిస్వాల్ 7.5 ప్రభుత్వానికి సిఫారసు చేయడంతో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు గగ్గోలు పెట్టాల్సిన పని లేదు సి.యం .కేసీఆర్ ఆమోదయోగ్యమైన పీఆర్సీ ఇవ్వడం ఖాయమని మేధావులు అభిప్రాయపడ్డారు.
నిరుద్యోగులకు అన్యాయం చేయద్దు….
ప్రభుత్వ ఉద్యోగులు మాములుగా ప్రభుత్వాలు మారాలని కోరుకునే ప్రయత్నంలోనే ఉంటారు.ఉద్యోగ, ఉపాద్యాయులకు పిఆర్సీ, ఆశజనకంగా ఇచ్చిన మార్పుకోరుతారు, ఇవ్వకున్న మార్పుకోరే సహజలక్షణం ఉన్న ఉద్యోగులు కోకొల్లలు, ప్రభుత్వంతో నాయకులు ఉన్నంత మాత్రాన క్యేడర్ , సభ్యులు ఉంటారనేది మన అవివేకం , తెలంగాణ ఉద్యమంలో ఉన్న హూషారు, 2018లో ఉన్నప్పటికీ, రాను,రాను సన్నగిల్లింది. నీళ్ళు, నిధులు నియమాకాల కోసం సాగిన పోరాటంలో నీళ్ళు, వచ్చినాయి, నిధులు ఉన్నాయి , ఇంటింటికీ లేనిదంతా ఉద్యోగాలే…కేసీఆర్ నాయకత్వంలో ఇప్పటికి ప్రభుత్వ రంగ సంస్థల్లో 1.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం,ప్రైవేట్ సంస్థల్లో ఫార్మా, ఐటీ రంగాలల్లో14.5 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడం , కోత్త సంవత్సరంలో 50000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని, ఈ మేరకు ఆర్థికశాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఇటీవల సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయడం స్వయంగా నిరుద్యోగులకు ఊరట కలిగించిందనే బావించాలి . కాని బిశ్వాల్ కమీటీ ఇచ్చిన నివేదికతో నైరాశ్యానికి గురవుచున్నారని, ఎవరు అడిగినారనీ,పదవి విరమణ వయస్సు 58 నుండి 60 కి తెర మీదకు తెస్తున్నారు. దీని వల్ల తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు అభద్రతకు గురైయ్యే ప్రమాదం ఉందని, నిరుద్యోగులకు నిరుత్సాహ పర్చకుండా ఉండాలంటే విరమణ వయస్సు పెంచే ప్రయత్నం విరమించుకోవాలి…బిశ్వాల్ కమిటీ నివేదిక తూచ తప్పకుండా పాటించాలనే నిబందన ఎక్కడలేదు, తెనే తుట్టె లా ఉన్న నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయోద్దని మేధావులు అభిప్రాయపడ్డారు.

జర్నలిజం విభాగాధిపతి,
కాకతీయ విశ్వవిద్యాలయం,వరంగల్,
సెల్ .986625535