Take a fresh look at your lifestyle.

రూ.120కోట్ల విలువైన 60 కేజీల మెఫిడ్రోన్‌ ‌డ్రగ్స్ ‌పట్టివేత

  • స్వాధీనం చేసుకున్న నార్కోటిక్స్ ‌కంట్రోల్‌ ‌బ్యూరో
  • కేసులో మాజీ ఎయిర్‌ ఇం‌డియా పైలెట్‌ ‌సోహెల్‌ ‌గఫార్‌ అరెస్టు

ముంబై,అక్టోబర్‌7: ‌ముంబైలోని వేర్‌హౌజ్‌ ‌నుంచి సుమారు 120 కోట్ల విలువైన 60 కేజీల మెఫిడ్రోన్‌ ‌డ్రగ్స్‌ను నార్కోటిక్స్ ‌కంట్రోల్‌ ‌బ్యూరో స్వాధీనం చేసుకున్నది. ఈ కేసులో మాజీ ఎయిర్‌ ఇం‌డియా పైలెట్‌ ‌సోహెల్‌ ‌గఫార్‌ను అరెస్టు చేశారు. ఇటీవల గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోనూ భారీ స్థాయిలో డ్రగ్స్‌ను పట్టుకున్న విషయం తెలిసిందే. ఆ కేసుతో దీనికి లింకు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.జామ్‌నగర్‌ ‌కేసులో ఇప్పటికే నలుగుర్ని అరెస్టు చేశారు.

అమెరికాలో శిక్షణ పొందిన గఫార్‌ ‌గతంలో ఎయిర్‌ ఇం‌డియాలో పైలెట్‌గా పనిచేశారు. అయితే మెడికల్‌ ‌కారణాలను చూపుతూ అతను కొన్నాళ్ల క్రితం జాబ్‌ ‌మానేశారు. విదేశీ డ్రగ్‌  ఇప్పటి వరకు 225 కేజీల మెఫిడ్రోన్‌ ‌డ్రగ్‌ను మార్కెట్‌లో అమ్మింది. దాంట్లో 60 కేజీల డ్రగ్‌ను గురువారం సీజ్‌ ‌చేశారు. జామ్‌నగర్‌కు చెందిన నేవీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు ముంబైలో నార్కోటిక్స్ ‌శాఖ దాడులు చేసింది.

గత కొన్నాళ్ల నుంచి గుజరాత్‌లో భారీ స్థాయిలో డ్రగ్స్‌ను సీజ్‌ ‌చేస్తున్న విషయం తెలిసిందే. వడోదరలో ఆగస్టులో 200కేజీల మెఫిడ్రోన్‌ ‌డ్రగ్స్‌ను సీజ్‌ ‌చేశారు. ఏప్రిల్‌లో 260 కిలోల డ్రగ్స్‌ను కండ్లా పోర్టులో పట్టుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ముంద్రా పోర్టులో సుమారు 21 వేల కోట్ల విలువైన 3వేల కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

Leave a Reply