Take a fresh look at your lifestyle.

కేంద్రంలో 6.83 లక్షల ఉద్యోగ ఖాళీలు

6.83 lakh job vacancies in central govt Jitendra Singh

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలలో 6.83 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సంబంధిత శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ ‌బుధవారం లోక్‌సభలో వెల్లడించారు. వ్యయ శాఖకు చెందిన చెల్లింపులు, పరిశోధనా విభాగం వార్షిక నివేదికను ప్రస్తావిస్తూ జితేందర్‌ ‌సింగ్‌ ‌వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్యకు సంబంధించి సభలో లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. మార్చి 1, 2018 నాటికి మొత్తం 38,02,779 ఉద్యోగాలు మంజూరు చేయగా 31,18,956 ఉద్యోగాలు భర్తీ అయ్యాయని ఆ నివేదిక పేర్కొంది. మార్చి 1, 2028 నాటికి 6,83,823 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ఆయా శాఖలలో పదవీ విరమణ, రాజీనామా, మరణాలు, పదోన్నతులు కారణంగా ఖాళీలు ఏర్పడ్డాయని, వాటిని సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్ధల నిబంధనలకు అనుగుణంగా భర్తీ చేయాల్సి ఉంటుందని మంత్రి వెల్లడించారు. ఆయా నియామక సంస్ధల కార్యాచరణ కాలెండర్ల ప్రాతిపదికగా మంత్రిత్వ శాఖలు, దాని సంబంధిత విభాగాలలో ఆయా సంవత్సరాల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసే నిరంతర పక్రియ కొనసాగుతోందన్నారు.

ప్రస్తుత 2019-2020 సంవత్సరంలో యుపిఎస్‌సి, ఎస్‌ఎస్‌సి, ఆర్‌ఆర్‌బిలు 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిఫార్సులు పంపాయని చెప్పారు. అత్యధికంగా ఆర్‌ఆర్‌బి 1,16,391 ఉద్యోగాల కోసం సిఫార్సులు పంపగా, ఎస్‌ఎస్‌సి 13,995, యుపిఎస్‌సిసి 4,399 ఉద్యోగాల కోసం సిఫార్సులు పంపాయి. మిగతా నియామక సంస్ధలైన ఎస్‌ఎస్‌సి, ఆర్‌ఆర్‌బి, పోస్టల్‌ ‌సర్వీసెస్‌ ‌బోర్డ్, ‌రక్షణ మంత్రిత్వ శాఖలు 3,10,832 ఖాళీ పోస్ట్‌లను భర్తీ చేయనున్నాయి. వీటిలో రక్షణ శాఖకు సంబంధించి 27,652 ఖాళీలు భర్తీ కానున్నాయి.

Leave a Reply