వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

6 ‌నుంచి భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలు

April 2, 2019

14న కళ్యాణం,15న పట్టాభిషేకం: శ్రీరామనవమి తిరుకల్యాణ బ్మ్రత్సవాలు ఏప్రిల్‌6 ‌నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందుకోసం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. బ్మ్రత్సవాల్లో భాగంగా 14న శ్రీసీతారాముల తిరుకల్యాణ మ•త్సవం, ఏప్రిల్‌15‌న మహా పట్టాభిషేకోత్సవం జరగనుంది. 6 ఉగాది రోజున బ్మ్రత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్‌10‌న ఉత్సవ అంకురారోపణం, మండప వాస్తు •మం జరపనున్నారు. ఏప్రిల్‌11‌న గరుడపఠ లేఖనం, గరుడ పఠ అదివాసం, ఏప్రిల్‌12‌న అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, ఏప్రిల్‌13‌న ఎదుర్కోలు ఉత్సవం, ఏప్రిల్‌14‌న శ్రీసీతారాముల తిరుకల్యాణ మ•త్సవం, ఏప్రిల్‌15‌న మహాపట్టాభిషేకోత్సవం జరపనున్నారు. ఏప్రిల్‌20‌న చక్రతీర్ధం, పూర్ణాహుతితో ఉత్సవాలు సమాప్తమవుతాయి.