Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో కొత్తగా 5,926 మందికి కోవిడ్‌ ‌పాజిటివ్‌

  • వైరస్‌తో 18 మంది మృతి
  • రాష్ట్రంలో తొలగని టీకాల కొరత
  • శంషాబాద్‌ ‌మున్సిపాలిటీ గొల్లపల్లిలో వంద మందికి కొరోనా..ముగ్గురు మృతి

రాష్ట్రంలో కోవిడ్‌-19 ‌పాజిటివ్‌ ‌కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం రాత్రి 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,926 కేసులు వెలుగుచూడగా, 18 కొరోనా మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,61,359కు చేరగా, మరణాల సంఖ్య 1,856కు చేరుకుంది. ప్రస్తుతం 42,853 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి. కాగా గతకొన్ని రోజులుగా భారీ సంఖ్యలో పాజిటివ్‌ ‌కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే సర్కారుకు ఏవి• పట్టడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొరోనా కట్టడికై లాక్‌డౌన్‌ ‌లేదా రాత్రి కర్ఫ్యూ విధించే అంశంపై 48 గంటల్లోగా నిర్ణయం తీసుకోవాలని సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ‌సర్కారు మంగళవారం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరోవైపు.. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సైతం కొరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో తొలగని టీకాల కొరత రాష్ట్రంలో టీకాల కొరత కొనసాగుతున్నది. మంగళవారం పూణె నుంచి సుమారు 6 లక్షల 50 వేల కోవ్యాక్సిన్‌, ‌కోవిషీల్డ్ ‌డోసులు రావాల్సి ఉన్నాయి. టీకా కేంద్రం నుంచి సరిపడినంత సరఫరా లేదు. మరో వైపు మొదటి సారి టీకా వేసుకున్న వారు రెండవ డోస్‌ ‌దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఏ సెంటర్‌కు వెళ్ళిన స్టాక్‌ ‌లేదని హెల్త్ ‌వర్కర్లు చెబుతున్నారు. గత పది రోజులుగా టీకాల సరఫరా కాకపోవడంతో కోవ్యాక్సిన్‌ ‌జిల్లాలకు ఎన్ని డోసులు పంపాలో తెలియని అధికారులు ఇష్టానుసారంగా డోసులు సరఫరా చేశారు. దీంతో కొన్ని సెంటర్లలో టీకా కొరత ఏర్పడింది. టీకా కోసం వొస్తున్న వారిని తిరిగి పంపిస్తున్నారు.శంషాబాద్‌ ‌మున్సిపాలిటీ గొల్లపల్లిలో వంద మందికి కొరోనా..ముగ్గురు మృతిశంషాబాద్‌ ‌మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో వంద మందికి పైగా కొరోనా బారిన పడ్డారు.

వీరిలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెటకొంది. ఇటీవల వ్యవసాయ శాఖ నిర్వహించిన రైతు సదస్సులో వారు పాల్గొన్నారు. ఈ క్రమంలో గ్రామస్తులకు పరీక్షలు నిర్వహించగా వంద మందికి వైరస్‌ ‌పాజిటివ్‌గా నిర్దారణ అయింది. మరో వైపు గొల్లపల్లితో పాటు శంషాబాద్‌ ‌లోని వివిధ గ్రామాల్లో పదుల సంఖ్యలో కొరోనా కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఇప్పటికే చిన్న గోల్కొండ ప్రభుత్వ పాఠశాలలోని పలువురు విద్యార్థులు కొరోనా బారిన పడ్డారు. పాలమాకుల పాఠశాలలోనూ ఇరవై మందికి పైగా వైరస్‌ ‌బారిన పడ్డారు. అయితే వంద మందికి కొరోనా కేసులు నమోదవడంతో గొల్లపల్లి గ్రామస్థులు స్వచ్చందంగా లాక్‌ ‌డౌన్‌ ‌విధించుకున్నారు.

Leave a Reply