Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌లో సీజ్‌ ‌చేసిన వాహనాల రిలీజ్‌

కరోనా వైరస్‌ ‌వ్యాప్తి నిరోధనలో భాగంగా లాక్‌డౌన్‌ ‌సమయంలో ట్రాఫిక్‌ ‌పోలీసులచే సీజ్‌ ‌చేయబడిన వాహనాలను శుక్రవారం రిలీజ్‌ ‌చేయనున్నట్లు రామగుండం సీపీ సత్యనారాయణ వెల్లడించారు. లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించిన మార్చి 24నుండి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడి ట్రాఫిక్‌ ‌పోలీస్‌ ‌వారిచే మాత్రమే సీజ్‌ ‌చేయబడిన వాహనాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 08 గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు వాహనములను 179 ఎంవీ యాక్ట్ ‌ప్రకారము రూ. 500/- జరిమానా సాంకేతిక పద్ధతిలో ఇ-చలాన్‌ ‌ద్వారా జరిమానాలు వేయడం జరిగినట్లు వివరించారు. ఆ వాహన యజమానూలు వారి వాహన పత్రములైన ఆర్‌సీ, లైసెన్స్‌లు జతపరచి వాహన యజమాని వ్యక్తిగతంగా వచ్చి వాహన నిర్ధారణ చేసుకుని ట్రాఫిక్‌ అధికారుల అనుమతి పొంది, వారి వాహనం స్వాధీనం చేసుకోవడం జరిగింది అని రసీదు వ్రాసి ఇచ్చి వాహనము తీసుకొని వెళ్ళాలని కోరారు.

వాహనాల యజమానులు స్వతహాగా వచ్చి మాత్రమే తీసుకోవాలని కోరారు. లా అండ్‌ ఆర్డర్‌ ‌పోలీస్‌ ‌వారు సీజ్‌ ‌చేసిన వాహనాల విడుదల మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుని తెలియజేస్తామని పేర్కొన్నారు. యజమానికి మాత్రమే వాహనం అందజేయబడును.వాహనదారులు వారికి విధించిన జరిమానను నగదు రూపేనా తీసుకోకుండా మీసేవ, పేఎటిఎం, టి ఎస్‌ ‌వ్యాలెట్‌ ‌ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది, ప్రతి ఒక్కరూ మాస్క్ ‌ధరించి సామాజిక దూరం పాటించాలని కోరారు.

Leave a Reply