Take a fresh look at your lifestyle.

కోర్టు ధిక్కరణ కేసులకు 58 కోట్లా?

ఎలా ఖర్చు చేస్తారో చెప్పండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్‌, ఆగస్ట్ 4(ఆర్‌ఎన్‌ఎ) : ‌కోర్టు ధిక్కరణ కేసుల ఖర్చులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఓ లెక్చరర్‌ ‌దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌హిమా కోహ్లి, న్యాయమూర్తి విజయ్‌సేన్‌ ‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు ధిక్కరణ కేసులకు రూ.58కోట్లు మంజూరు చేయడమేంటని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.

ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తారో వివరించాలని.. ట్రెజరీ నిబంధనలు ఎలా అనుమతిస్తాయో చెప్పాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై రెవెన్యూ, ఆర్థిక శాఖ కార్యదర్శులతో పాటు సీసీఎల్‌ఏ, ‌ట్రెజరీ డైరెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఎస్‌ ‌సోమేశ్‌కుమార్‌కు వ్యక్తిగత •దాలో నోటీసులు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్‌ 27‌కి వాయిదా వేసింది.

Leave a Reply