Take a fresh look at your lifestyle.

మిల్లర్లతో కుమ్మకైన ప్రభుత్వం : నాయిని

రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లతో కుమ్ముక్కై రైతులను నిలువుదోపిడి చేస్తుందని వరంగల్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌ ‌రెడ్డి అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ ‌కమిటీ ఆదేశాల మేరకు మంగళవారం హన్మకొండ కాంగ్రెస్‌ ‌భవన్‌లో రైతు సమన్వయ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు నాయిని రాజేందర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలులో పూర్తిగా విఫలమైందని మిల్లర్లతో ప్రభుత్వం మిలాఖత్‌ అయి తరుగు పేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తుందని ఆయన ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం వెంటనే డబ్బులు చెల్లించాలని ఆయన అన్నారు. రైతుల వద్ద నుండి కొనుగోలు చేస్తున్న వారందరూ మిల్లర్లతోనే కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం రైతులను నిలువు దోపిడీ చేస్తుందని మట్టి పేరుతో ఒక బస్తాకు మూడు కిలోల వరకు తరుగు తీసేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు. కేవలం మాటలు చెప్పటమే కానీ ఆచరణలో మాత్రం ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆయన అన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. గతంలో ప్రభుత్వాలు రైతులకు నష్టపరిహారం చెల్లించే ఆచారం ఉండేది టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వచ్చిన తర్వాత అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పంట నష్టం చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఇప్పటికైనా ప్రభుత్వం నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున చెల్లించాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. కరోనా వైరస్‌ ‌కట్టడిలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు పూర్తిగా విఫలమ య్యాయని వైరస్‌ ‌పరీక్షలు చేయకుండా దాట వేస్తున్నారని వాస్తవాన్ని పూర్తిగా దాస్తున్నారని ఆయన అన్నారు. వలస కార్మికుల పట్ల టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లనే సమస్య జఠిలం అయిందని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేయాలని సొసైటీల ద్వారా కొనుగోలు చేస్తే కొంత మందికి మాత్రమే ఉపయోగపడుతుందని సొసైటీల ద్వారా కొనుగోలు చేయకుండా స్వయంగా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు.

టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన డిమాండ్‌ ‌చేశారు. తడిసిన ధాన్యానికి కూడా సరైన ధర చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా వరంగల్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్ష చేపట్టినట్లు ఆయన అన్నారు. ఈ దీక్ష వలన ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్‌, ‌టిపిసిసి ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్‌, ‌పిసిసి సభ్యుడు బత్తిని శ్రీనివాస్‌రావు, ఈవి శ్రీనివాస్‌ ‌రావు, జి.అమృతరావు, టిపిసిసి కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్‌, ‌టిపిసిసి ఓబిసి డిపార్ట్మెంట్‌ ‌కన్వినర్‌ ‌మోడెమ్‌ ‌శ్రీధర్‌ ‌గౌడ్‌, ‌జిల్లా కిస్సాన్‌ ‌సెల్‌ ‌చైర్మన్‌ ‌పింగిళి వెంకట్‌రామ్‌ ‌నర్సింహా రెడ్డి, గ్రేటర్‌ ‌మహిళా కాంగ్రెస్‌ ‌చైర్మన్‌ ‌బంక సరళ, బిసి సెల్‌ అర్బన్‌ ‌నాయకుడు జక్కుల రవీందర్‌ ‌యాదవ్‌, ‌బ్లాక్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని లక్ష్మా రెడ్డి, బంక సంపత్‌ ‌యాదవ్‌, ‌జిల్లా, గ్రేటర్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకులు డివిజన్‌ ‌డివిజన్‌ అధ్యక్షులు పాల్గొన్నారు.

Leave a Reply