Take a fresh look at your lifestyle.

తెలంగాణలో కొత్తగా 5,695 కొరోనా కేసులు నమోదు

వైరస్‌ ‌బారినపడి మరో 49 మంది మృత్యువాత
 తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 5,695 కొరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. వైరస్‌ ‌బారినపడి మరో 49 మంది ప్రాణాలు వదిలారు. ఆదివారం ఒకే రోజు 58,742 మంది పరీక్షలు చేయగా.. 5,695 కేసులు వెలుగు చూశాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మహమ్మారి నుంచి కొత్తగా 6,206 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80,135 యాక్టివ్‌ ‌కేసులున్నాయని పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎం‌సీలో 1,352, మేడ్చల్‌ ‌జిల్లాలో 427, రంగారెడ్డిలో 483 కొరోనా కేసులు నమోదయ్యాయి. ఇదిలావుంటే జ్వరం, ఇతర లక్షణాలతో బాధపడే వ్యక్తులను గుర్తించి, వారి ప్రాంతాల్లోని ప్రతి ఇంటిని సందర్శించాలని అధికారులకు సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం మునిసిపల్‌ ‌సిబ్బంది, ఏఎన్‌ఎమ్‌, ఆశా కార్యకర్తలతో బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎం‌సీ కమిషన్‌, ‌వైద్యశాఖ ఉన్నతాధికారులతో ఆదివారం సోమేశ్‌ ‌కుమార్‌ ‌టెలికాన్ఫరన్స్ ‌నిర్వహించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొవిడ్‌ ‌లక్షణాలున్న వారందరికీ హోమ్‌ ఐసోలేషన్‌  ‌మెడికల్‌ ‌కిట్లను అందజేయాలని అధికారులకు సోమేశ్‌ ‌కుమార్‌ ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేసే బృందాలతో ఈ కిట్లను పంపాలని చెప్పారు.  కొవిడ్‌ ‌లక్షణాలున్న వారు ఆ మందులను ఎలా వేసుకోవాలని సలహా ఇప్పించాలని, అలాగే లక్షణాలున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆబృందాలతో పర్యవేక్షింపజేయాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాల్లోనూ అవుట్‌ ‌పేషంట్‌ ‌క్లినిక్స్ ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిశుభత్ర డ్రైవ్‌ ‌నిర్వహించాలని సీఎస్‌ ఆదేశించారు. అన్ని సర్కిళ్లలో కొవిడ్‌ ‌కేర్‌ ‌కేంద్రాలను ప్రారంభించాలన్నారు. 

Leave a Reply